క్లింకారతో మెగా ఫ్యామిలీ వెకేషన్.. ఇంతకీ ఎక్కడికో తెలుసా..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ చేయడానికి కమిట్మెంట్ సైతం ఇచ్చాడు చిరంజీవి. ఇందులో భాగంగానే వీటి మధ్య కాస్త గ్యాప్ దొరకడంతో చిరంజీవి తన కుటుంబంతో కలిసి కాస్త రిలాక్స్ అవుదామని

 చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ లభించడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు బయలు దేరి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. తన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి సరదాగా లండన్‌లో విహరిస్తున్నారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. అలాగే తన లండన్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా లండన్‌లోని హైడ్ పార్క్‌లో చిరంజీవి ఫ్యామిలీ కలిసి దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో

 వైరల్ గా మారింది. ఇందులో మెగా క్వీన్ క్లింకారా కొణిదెల ఫేస్ కొంచెం మాత్రమే కనిపించింది. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇదిలవుండగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార వంటి పీరియాడికల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచెరస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ ఈ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మెగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: