పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్..!?

Anilkumar
బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు షోస్ కూడా చేస్తోంది. షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది అనసూయ. జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయింది. ఓ వైపు యాంకర్‌గా చేస్తూనే

 సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నటిగా సైతం క్రేజ్ తెచ్చుకుంది.  రంగస్థలం, పుష్ప, ఖిలాడీ, రజాకార్ తదితర సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన రంగమ్మత్త అనసూయ ప్రస్తుతం ఓ టీవీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అదే స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్. ఈ షోలోనే తాను పవన్ కల్యాణ్‌తో ఓ బ్యూటిఫుల్ డ్యాన్స్ నెంబర్ అంటే స్పెషల్ సాంగ్ చేసినట్లు అనసూయ చెప్పుకొచ్చింది.  కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో పవన్ కల్యాణ్ చిన్నప్పటి ఫొటో చూపించి ఎవరో గెస్

 చేయమని అడిగారు. అప్పుడు అందరూ పవన్ కల్యాణ్ అని చెప్పారు. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్ అసలు విషయం చెప్పింది.   "నేను ఇప్పటివరకు ఏ టీవీ షోలో చెప్పలేదు. తొలిసారి ఓ టెలివిజన్ షోలో ఈ విషయం చెబుతున్నాను. నేను పవన్ కల్యాణ్ గారితో ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ నెంబర్ చేశాను అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. మన టెలివిజన్‌లో మోత మోగిపోద్ది ఆ పాట మాత్రం" అని యాంకర్ అనసూయ భరద్వాజ్ చాలా సంతోషంగా చెప్పింది. కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం హర హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఏ సినిమాలో అనసూయ ఐటమ్ సాంగ్ చేసి ఉంటుందని వాళ్లలో వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: