టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన విశ్వక్సేన్ ఎప్పుడు డిఫరెంట్ కద లను ఎంచుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యాక్టర్ గా ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. ఇక ఇటీవల గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ ఈ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను
తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ తన నటనతో మరోసారి అభిమానులను అలరించడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26న మెకానిక్ రాకీ సాంగ్ లేదా గ్లింప్స్ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. అదే రోజు మీడియా మీట్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసారు. మెకానిక్ రాకీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉండటం ఈ సినిమాని బిజినెస్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అందులో భాగంగానే గ్లింప్స్ ని ప్రేక్షకుల
ముందుకి తీసుకొని రాబోతున్నారని టాక్. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి విశ్వక్ సేన్ కి జోడీగా నటిస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ మరో కీలక పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర ఏంటనేది పూర్తిగా రివీల్ చేయలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు పోటీగా ఎలాంటి సినిమాలు వస్తాయా అని వారు ఎదురుచూస్తున్నారు. అయితే, టాలీవుడ్లో ప్రస్తుతం దీపావళి బరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవీ కూడా లేవనే చెప్పాలి. ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్స్ను అనౌన్స్ చేశాయి..!!