ఇండియన్‌ సినిమాను ఆదుకున్న కల్కి?

Chakravarthi Kalyan

చూస్తుండగానే 2024లో ఆరు నెలలు గడిచిపోయాయి. మార్చి నుంచి ఎన్నికల హడివుడితో ఈ అర్థ సంవత్సరం బిజీగా గడిచిపోయింది. అయితే ఈ అర్ధం భాగంలో భారతీయ సినిమా పరిశ్రమ ఎలా ఉందో ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ నివేదిక విడుదల చేసింది.  దీని ప్రకారం ప్రథమ భాగంలో సినీ ఇండస్ర్టీ రూ.5000 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని తెలిపింది. ఇది గతేడాది జనవరి నుంచి జూన్ తో పోల్చితే కేవలం మూడు శాతం మాత్రమే ఎక్కువని పేర్కొంది.

వాస్తవంగా చెప్పాలంటే ఇవి కొద్దిగా నిరాశజనకా ఫలితాలే. దీనికి పలు కారణాలు సైతం ఉన్నాయి. ఒక్క  జూన్ లోనే దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీనిని మినహాయిస్తే బాక్సాఫీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. జూన్ లో ఇంతలా రావడానికి కారణం కల్కీ సినిమా. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదల ముందు నుంచే రికార్డులు సృష్టిస్తోంది.  నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ రేపుతోంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సాలిడ్ కలెక్షన్లు అందుకుంటుంది. జూన్ లో వచ్చిన రూ.1200 కోట్ల కలెక్షన్లలో 60శాతం వరకు కల్కీ సినిమాకు వచ్చినవే కావడం గమనార్హం. ఓవరాల్ గా తీసుకుంటే 15శాతం ఈ సినిమావే కావడం విశేషం.

ఇక ద్వితీయార్థంలో భారతీయ సినిమా ఘనంగా ఉండబోతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. తొలి అర్ధ భాగంలో పెద్ద పెద్ద సినిమాలు అంతగా ఏమీ రాలేదు.  ఎన్నికలు, ఐపీఎల్ కూడా ప్రభావం చూపాయి. కానీ సెకండాఫ్ లో మాత్రం దేవర, ఓజీ, పుష్ప-2, గేమ్ ఛేంజర్ వంటి బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమాలు రాబోతున్నాయి. ఫలితంగా భారీ ఎత్తున కలెక్షన్లు ఉండబోతున్నాయి అని ఆర్మాక్స్ సంస్థ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: