26వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. టైటిల్ ఏంటంటే..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో 1000 కోట్లు కొల్లగొట్టాడు ప్రభాస్. అయితే ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన డార్లింగ్ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. థియేటర్స్ లో భారీ హిట్ తో కల్కి సినిమా దూసుకుపోతుంది. ఎంతో ఆతృతగా ఎదురుచూసిన కల్కి వచ్చి హిట్ అవ్వడంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్ 2, రాజా సాబ్, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా అయ్యాకే సలార్ 2

 మొదలవుతుంది. స్పిరిట్ వచ్చే సంవత్సరమే. రాజా సాబ్ షూట్ నడుస్తుంది. కల్కి 2 కూడా వచ్చే సంవత్సరం షూట్ ఉంటుంది. ఇక హను రాఘవ పూడి సినిమా త్వరలో మొదలుపెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం హను రాఘవపూడి – ప్రభాస్ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్స్ జరుగుతున్నాయని టాలీవుడ్ సమాచారం. ప్రభాస్ రాజా సాబ్ సినిమాకి డేట్స్ ఇవ్వనున్నాడు. ఆగస్టు వరకు రాజా సాబ్ షూటింగ్ పూర్తిచేసి సెప్టెంబర్ నుంచి హను రాఘవపూడి సినిమాకి డేట్స్ ఇస్తాడు అని తెలుస్తుంది. దీంతో సెప్టెంబర్ లో హను రాఘవపూడి – ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలవుతుందని అన్నారు. కానీ తాజాగా

 అందుతున్న సమాచారం ప్రకారం  ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కథ చర్చలు కూడా ఇటీవల ముగిసినట్లు తెలుస్తోంది. హను కంప్లీట్ చేసిన బౌండెడ్ స్క్రిప్ట్ ను ప్రభాస్ కు వినిపించగా పచ్చజెండా ఊపాడు. అక్టోబరు నుండి ఈ మూవీ షూటింగ్ ని షురూ చేయనున్నారు. ఈ సినిమాకు 'ఫౌజీ'  అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఇప్పటికే దీన్ని నిర్మాతలు ఫిలిం చాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఇక, ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. రీసెంట్ గా ఓ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ హను ఈ విషయంపై మాట్లాడుతూ..'నా నెక్స్ట్ ఫిల్మ్ ప్రభాస్‌తో ఉంటుంది.అది పూర్తిస్థాయి పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు తెలిపారు. ఇదొక చారిత్రక ఫిక్షన్ ఫిల్మ్.అన్ని అనుకున్నట్లుగానే సినిమా కోసం మంచి కథ కుదిరింది.ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్‌ ఈ సినిమా కోసం ఓ మూడు పాటలు కూడా కంపోజ్‌ చేశారు' అని హను చెప్పారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: