డిసెంబర్ రేస్ నుండి తప్పుకునేది ఎవరు..!?

Anilkumar
ఏ ఇండస్ట్రీలో నైనా అన్ని సినిమాలు ఒకేసారి రావడం సాధారణం. అలా వచ్చిన సినిమాలు కొన్ని కొన్ని సార్లు బాగున్నప్పటికీ ఫ్లాపు లుగా మారుతూ ఉంటాయి. అలా అన్ని సినిమాలు ఒకేసారి రావడం వల్ల పలు సినిమాలకి థియేటర్స్ కూడా దొరకడం కష్టం. అయితే సాధారణంగా మన టాలీవుడ్ లో ఇటువంటి పరిస్థితులు సంక్రాంతికి చోటు చేసుకుంటాయి. కానీ ఈసారి మాత్రం డిసెంబర్లో ఇదే పరిస్థితి  కనబడుతోంది. ఒకప్పుడు డిసెంబర్ అంటే క్రిస్టమస్ రోజు మాత్రమే ఒకటి అరా సినిమాలు వచ్చేవి, కానీ అఖండ, పుష్ప లు డిసెంబర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో డిసెంబర్ కు సినిమాలు

 క్యూ కడుతున్నాయి. అయితే ఆ లిస్టులో  నితిన్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమా ఉంది. వారితో పాటు అక్కినేని నాగచైతన్య చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న తండేల్ కూడా దాదాపుగా అదే నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. నిర్మాత బన్నీ వాసు దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం తండేల్ సినిమా డిసెంబర్ బరిలో నుండి తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న రావాల్సిన పుష్ప-2 షూటింగ్ డిలే కారణంగా వెనక్కు జరిగి డిసెంబర్ 6న వస్తున్నామని ప్రకటించారు

 మేకర్స్. పుష్ప ఆగస్టులో వచ్చేస్తుందని భావించి కన్నప్ప డిసెంబర్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసాడు మంచు విష్ణు. పుష్ప వచ్చినా సరే తాము ఆగేదిలేదని కన్నప్ప నిర్మాత మంచు విష్ణు ప్రకటించారు. ఈ రెండు సినిమాలతో పాటు శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ డిసెంబర్ 25న విడుదల ఫిక్స్ అని టాక్ వినిపిస్తోంది. అటు బాలయ్య సినిమా కూడా డిసెంబర్ లిస్ట్ లో ఉంది. చివరికి డిసెంబర్ రేసులో ఎవరుంటారో ఎవరు తప్పుకుంటారో మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: