నాని సరిపోదా శనివారం నుండి వీడియో గ్లింప్స్..!

Anilkumar
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. అయితే ఇందులో వర్సటైల్ యాక్టర్ యస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో సరిపోదా శనివారం టీం ఈ సినిమా నుండి ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. పోలీస్ ఆఫీసర్ కి ఒక కామన్ మెన్ కి మధ్య పోరాట నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేశారు. భాగవతం కథతో నాని వాయిస్ ఓవర్ ద్వారా ఎస్ జె పాత్రను పరిచయం చేశారు. అయితే తెలుగు వీడియో ని అయినప్పటికీ అందులో హిందీ డైలాగ్స్ ఉన్నాయి.  ఇక సరిపోదా శనివారం సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తోన్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ

 కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. వివేక్ ఆత్రేయ గత సినిమాలు ఫన్, ఎమోషన్స్‌తో సాగగా సరిపోదా శనివారం మాత్రం యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. గ్యాంగ్ లీడర్ తర్వాత మరోసారి నాని, ప్రియాంక మోహన్ సరిపోదా శనివారం మూవీలో జంటగా నటిస్తోన్నారు. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తోన్నాడు. హై బడ్జెట్‌, టెక్నికల్ వాల్యూస్‌తో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రొడక్షన్ హౌజ్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ మూవీని నిర్మిస్తోన్నారు. . ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సరిపోదా శనివారం తర్వాత నాని మరో మూడు సినిమాలకు అంగీకరించినట్లు సమాచారం. దసరా తర్వాత

 దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ మాస్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సరిపోదా శనివారం మూవీ షూటింగ్ జరుగుతోంది. నానితో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్‌ను దర్శకుడు షూట్ చేస్తోన్నట్లు సమాచారం. ఈ వారంలోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానున్నట్లు సమాచారం. ఆగస్టు 29న పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సరిపోదా శనివారం విడుదలకాబోతోంది. జేక్స్ బిజయ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తోన్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: