పుష్ప 2: సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్.. అందుకే షూటింగ్ కి బ్రేక్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2  తెర. నిజానికి పుష్ప 2 సినిమా ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రకటించారు చిత్ర బృందం. కానీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశారు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ అల్లు అర్జున్ మధ్య పలు వివాదాలు జరుగుతున్నాయని అందుకే ఈ సినిమా షూటింగ్ ఆపేసి అల్లు అర్జున్ యూరప్ వెళ్ళాడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సుకుమార్ తో జరిగిన గొడవ

 వల్లే అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం పెంచుకున్న తన గడ్డాన్ని మొత్తం తీసేసాడు అని దాంతో అల్లు అర్జున్ పై కోపంగా ఉన్న సుకుమార్ సైతం తన కుటుంబంతో యుఎస్ ట్రిప్ కి వెళ్ళాడు అని పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. మరోవైపు పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా 30 రోజుల వరకు ఉంది అని తెలుస్తుంది. ఈ మధ్యలోనే వీళ్లిద్దరి మధ్య గొడవలు రావడంతో ఈ షూటింగ్ ఆపేశారు అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇదంతా చూస్తుంటే పుష్పటు డిసెంబర్లో రావడం కూడా కష్టమే అని అంటున్నారు. ఇదిలవుండగా సుకుమార్ ఇలా ప్రవర్తించడం వెనక పెద్ద రీజనే ఉందని అనుకుంటున్నారు. స్వతహాగా సుకుమార్ మెగా అభిమాని. చిరంజీవి అంటే

 ఇష్టం ఐతే ఆ తర్వా పవన్ కళ్యాణ్ మీద కూడా అంతే ఇష్టాన్ని పెంచుకున్నాడు. జనసేన అధినేతగా పవన్ ఈసారి గెలవడాన్ని సుకుమార్ ఎంజాయ్ చేశాడు. ఐతే పవన్ కు సపోర్ట్ చేస్తూనే మరోపక్క నంద్యాల వెళ్లి శిల్పా రవికి ప్రచారం చేశాడు అల్లు అర్జున్. ఆ విషయం మెగా ఫ్యాన్స్ కి నచ్చకనే అల్లు అర్జున్ మీద మళ్లీ ఎటాక్ మొదలు పెట్టారు. ఈ విషయంలో సుకుమార్ కూడా బన్నీని వ్యతిరేకిస్తున్నాడని తెలుస్తుంది. తన హీరో న్యాయం ధర్మం వైపు ఉండాలి కానీ అధర్మం వైపు కాదని ఆయన అనుకుంటున్నాడట. ఐతే దాని వల్ల సినిమాను మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు కానీ అన్ని అనుకున్నట్టుగా కుదరకపోవడం వల్ల సుకుమార్ పుష్ప 2 షూటింగ్ లేట్ చేస్తున్నాడని తెలుస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: