కంగువ నుండి అదిరిపోయే అప్డేట్.. సూర్య ఏకంగా అన్ని గెటప్స్ లో..!?

Anilkumar
తమిళ స్టార్ హీరో సూర్యకి తమిళంలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో దానికి తగ్గట్లుగానే తెలుగులో కూడా ఈయనకి మంచి డిమాండ్ ఉంది. తెలుగులో సూర్య సినిమాలు విడుదలై ఇప్పటికే భారీ విజయాన్ని అందుకున్నాయి. టాలీవుడ్ లో కూడా సూర్య సినిమాలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ స్టార్ హీరో కంగువ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి తగ్గట్లుగానే సూర్య అభిమానులు సైతం ఎంతో కాలంగా కంగువ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

యాక్షన్ డైరెక్టర్ శివా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10 విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సూర్య ఫాన్స్. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఈ  సినిమా లో సూర్య మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమా  లో మూడు పాత్రల కోసం సూర్య తనని తాను మార్చుకున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఈ  సినిమా లో ఆయన నటించిన మూడు పాత్రలు 'కంగువ' కథకు అదిరిపోయే ట్విస్ట్‌ని తీసుకువస్తుందని

 తెలుస్తోంది. 'కంగువ' నుండి సూర్య రెండు లుక్‌లు ఇప్పటికే రివీల్ అయ్యాయి. ఈ  సినిమా లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కనిపించబోతున్నాడు. తమిళంలో బాబీకి ఇదే మొదటి . ఈ చిత్రంలో బాబీతో పాటు దిశా పటానీ కూడా కనిపించనుంది. ఈ చిత్రంలో నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రాడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్, రవి రాఘవేంద్ర వంటి నటీనటులు నటించారు. ఈ లో ఓ అద్భుతమైన వార్ సీక్వెన్స్ ఉండనుంది. ఈ వార్ సీక్వెన్స్‌లో దాదాపు 10 వేల మంది వరకు ఉండబోతున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: