నాకు సిగ్గు,శరం లేదు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్?

praveen

జగపతిబాబు.. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో హిట్స్ సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో బాగా రాణించాడు. వైస్ పై పడ్డాక హీరోగా కిడ్స్ అందుకోలేకపోయాడు. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అనంతరం విలన్‌గా మారి మళ్లీ ఇప్పుడు బిజీ యాక్టర్ అయిపోయాడు. ఒక్క తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా అనేక అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నటుడు చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఏ పనిచేసినా ఇతర సినిమా వాళ్లకి భిన్నంగా చేస్తాడు.
సోషల్ మీడియాలోనూ చాలా చమత్కారంగా పోస్టులు పెడుతుంటాడు. ఆ పోస్ట్ ల ద్వారా తన లైఫ్ స్టైల్ చూపిస్తుంటాడు. వెరైటీగా బతుకుతుంటాడు కాబట్టి అతని పోస్టుల్లో కాస్త వెరైటీ కంటెంట్‌యే కనిపిస్తుంది. తాజాగా జగపతిబాబు షేర్ చేసిన పోస్టులో కూడా అలాంటి ఓ విచిత్రమైన స్టఫ్ కనిపించింది. ఆ ఫోటోలో జగపతిబాబు క్యాసినోకి వెళ్లి ఆ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. జగపతిబాబు అక్క‌డ దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఓ బోల్డ్ క్యాప్షన్ రాసి అందరినీ అవాక్కయ్యేలాగా చేశాడు.
ఈ క్యాప్షన్‌లో "నాకు సిగ్గు శ‌రం లేద‌ని దిగులు ప‌డ‌ను.. కానీ మీరు చెబితే ప‌డ‌తాను" అంటూ ఈ రాశాడు. దీన్ని బట్టి జగపతి బాబు క్యాసినోలో పోక‌ర్ గేమ్ ప్లే చేసినట్లు స్పష్టంగా తెలిసింది. అందుకే ఇలా డిఫరెంట్ క్యాప్షన్ ఇచ్చాడు. తన జీవితాన్ని ఎలాగడిపితే అలాగే బయటకు చూపించే ఏకైక మొనగాడు జగపతిబాబు అని చాలామంది అంటున్నారు. మిగతావారు రక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
కాసినోలు, జూదం వివాదాస్పద అంశాలు. ఇవి వ్యసనం లాగా తయారవుతాయని చాలామంది వీటిని దూరంగా ఉంటారు కానీ కొంతమంది ఎంజాయ్మెంట్ కోసం సరదాగా వీటిని ఆడుతుంటారు. అందువల్ల జగపతిబాబు చేసిన దాంట్లో తప్పేం లేదని కొంతమంది సమర్థిస్తున్నారు. ఇకపోతే త్వరలోనే జగపతిబాబు నటించిన మిస్టర్ బచ్చన్, పుష్ప పార్ట్‌ 2 వంటి పలు సినిమాలు థియేటర్లో సందడి చేయనున్నాయి. కంగువ అనే తమిళ మూవీలో కూడా జగపతిబాబు నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: