పవన్, శంకర్ కాంబోలో మూవీ మిస్స్.. కారణమేంటంటే..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ.. మరి సినిమాల విషయం పవన్ ఏం చేస్తాడు అన్న కన్ఫ్యూజన్ అందరిలో ఉంది. ఇప్పటికే పవన్ ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ అరాకోరా మిగిలే ఉంది. కాస్త టైం దొరికినా కూడా పవన్ సినిమాలకే ఆ సమయాన్ని కేటాయించాలి అని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడే ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. కాబట్టి దాదాపుగా మూడు నెలలు అయినా ప్రజలకు అన్ని సౌకర్యాలను సమకూర్చిన తర్వాతే మళ్ళీ సినిమాల వైపు రావాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా ఇటీవల పవన్ క్లారిటీ ఇచ్చాడు. ఇది కాసేపు

 పక్కన పెడితే.. గతంలో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో పవన్ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే శంకర్ చేసే సినిమాలు చాలావరకు అవినీతి పైనే ఉంటాయి. లంచం తీసుకోవడం నేరం అంటూ చాలా సినిమాల్లో ఈ ట్యాగ్ యూస్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి డైరెక్టర్ పవన్ తి ఒక పవర్ఫుల్ సినిమాతో అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ అవినీతిని తరిమికొట్టే నేపథ్యంలో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అదే ఉద్దేశంతో అన్నా హజారే ఇన్స్పిరేషన్ తో పవన్ కోసం


 ఒక కథ కూడా రెడీ చేసుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ కి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమాని చేయకుండా వదిలేసినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి. ఇక ఈ సినిమా పట్టలెక్కకపోవడానికి ఇదొక కారణం అయితే, మరొక కారణమేమిటంటే పవన్ కళ్యాణ్ అవినీతి పైన సినిమాలు చేసి జనాల మీద తన అభిప్రాయాన్ని రుద్దాల్సిన అవసరం లేదని అనుకుంటాడట.  ఎందుకంటే తను నిజజీవితంలో అవినీతి, అన్యాయాల పైన పోరాడుతూ ఉంటాడు. కాబట్టి దానికి ప్రత్యేకించి సినిమా ద్వారా చెప్పాలి అని మాత్రం అనుకోడట. తను ఏం చేసినా నిజజీవితంలోనే చేయాలి అనుకుంటాడు కాబట్టి వాటిని సినిమా ద్వారా చెప్పే దానికంటే తను డైరెక్ట్ చేయడమే బెస్ట్ అని అవినీతిని అంతం చేసే సినిమాలు తన దృష్టి కి వచ్చిన వాటి మీద ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టలేదట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: