లుక్ మార్చిన టిల్లు.. దానికోసమే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. డిజె టిల్లు సినిమాతో స్టార్ హీరోలకు తగ్గ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల డీజే టిల్లుసినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. అయితే ఆయన చేసిన టిల్లు సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దాదాపుగా మూడు సంవత్సరాల నుండి మీడియాకు టిల్లు గెటప్ లోనే కనిపిస్తున్నాడు. బయట ఏ కార్యక్రమం ఏ ఈవెంట్ జరిగిన కూడా

 టిల్లు సినిమాలో ఆయన గెటప్ ఎలా అయితే ఉంటుందో బయట కూడా అలాగే తన లుక్ ను చూపిస్తాడు. అయితే గత మూడు సంవత్సరాల నుండి ఇదే గెటప్ లో కనిపించి బోర్ కొట్టిందేమో తాజాగా తన లుక్ మొత్తం మార్చేసాడు సిద్దు జొన్నలగడ్డ. తాజాగా ఆయన లుక్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మాస్ లుక్ లో సిద్దు ను చూసి బోర్ కొడుతుంది అనుకున్న వారికి తన కొత్త లుక్ ను సిద్దు చూపించాడు.సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా అనే సినిమాలో నటించబోతున్నాడు. ఇటీవలే సినిమాకు

 సంబంధించిన ఫస్ట్‌ లుక్ ను రివీల్‌ చేయడం జరిగింది. స్టైలిష్ లుక్ లో చాలా హ్యాండ్సమ్‌ గా సిద్దు జొన్నలగడ్డ కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిద్దు కు గుర్తింపు మరియు స్టార్‌ డమ్‌ తెచ్చి పెట్టిన టిల్లు లుక్ నుంచి బయటకు వచ్చాడు. డీజే టిల్లు మరియు టిల్లు స్క్వేర్‌ సినిమాల తర్వాత సిద్దు చేస్తున్న సినిమా తెలుసు కదా సినిమా చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమా పై ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రాబోతున్న 30వ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు మ్యూజిక్‌ ని థమన్‌ అందించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందనున్న ఈ సినిమా లో సిద్దు లుక్‌ కి మంచి మార్కులు పడ్డాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: