ప్రియురాలితో హృతిక్ పెళ్ళి.. నిజమేనా..!?

Anilkumar
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సభల ప్రేమాయణం గురించి నిరంతరం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే ఈ జంట ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. బాలీవుడ్ లో లేటెస్ట్ కపుల్ అయిన వీరిద్దరూ త్వరలోనే పెళ్లి  చేసుకోబోతున్నారు అన్న వార్త  అందరితో షేర్ చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం వినబడుతోంది. అయితే తాజాగా ఈ విషయానికి క్లారిటీ ఇస్తూ సభ అజాద్ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఇక దానికి

 హృతిక్ స్పందించడంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా సభ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రివిలింగ్ నూన్ అని పోస్ట్ చేయగా దానికి స్పందించిన ఆగలేకపోతున్నాను అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అయితే దాని అర్థం ఈ జంట పెళ్లి కోసం ఆగలేకపోతున్నారు అనే అంటున్నారు అభిమానులు. ఏదేమైనా వీళ్ళిద్దరి పెళ్లి విషయం ఏమో కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి హృతిక్ తన మాజీ భార్య సుజానే ఖాన్‌తో విడిపోయినప్పటి

 నుండి మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదా సంబంధం గురించి మాట్లాడలేదు. కానీ సబాతో అతడి బంధం సమున్నతమైనది. తన సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని అతడు ప్లాన్ చేస్తున్నాడని కథనాలొస్తున్నాయి. ఇటీవల ఈ జంట తమ సంబంధంపై సీరియస్ గా ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సబా రోషన్ల నుండి కూడా అంగీకారం పొందింది. ఆమె హృతిక్ తల్లి పింకీ, సోదరి సునైనా, కజిన్ పష్మీనాకు అత్యంత సన్నిహితురాలిగా మెలుగుతోంది. రోషన్ కుటుంబంతో కలిసిపోతోంది సబా. తరచుగా పుట్టినరోజులు ఇతర వేడుకలకు హాజరవుతుంది. తక్కువ వ్యవధిలో హృతిక్- సబా మధ్య బాండింగ్ బలపడింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: