Sardar 2 : కార్తీ 'సర్దార్ 2' సెట్ లో భారీ ప్రమాదం.. ఒకరు మృతి!

Anilkumar
కోలీవుడ్ స్టార్ కార్తీ నటిస్తున్న 'సర్దార్ 2' మూవీ సెట్స్ లో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ ఫైట్ సీన్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. సర్దార్ 2 షూటింగ్ లో భాగంగా ఫైట్‌ సీన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న స్టంట్‌ మ్యాన్‌ ఎజుమలై ప్రమాదవశాత్తూ 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు.దీంతో వెంటనే స్పందించిన చిత్రబృందం అతడిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించింది.
అంత ఎత్తు నుంచి కిందపడటం వల్ల ఛాతీ భాగంలో తీవ్ర గాయంఅవ్వడంతో పాటూ ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విరుగంబాక్కమ్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. స్టంట్‌ చేస్తున్న సమయంలో భద్రతా పరికరాలు ఉపయోగించనట్టుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఊహించని ఈ ప్రమాదంతో సినిమా షూటింగ్‌ను అర్దాంతరంగా నిలిపేశారు.

కార్తీ హీరోగా ఇటీవల సర్దార్ 2 ప్రకటించారు. పూజా కార్యక్రమాలతో మూవీ లాంచ్ చేశారు. జులై 15 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 2022లో విడుదలైన సర్దార్ చిత్రానికి సర్దార్ 2 సీక్వెల్. కార్తీ పోలీస్ అధికారిగా, సీక్రెట్ ఏజెంట్ గా రెండు భిన్నమైన పాత్రలు చేశాడు. సర్దార్ చిత్రానికి దర్శకత్వం వహించిన పీఎస్ మిత్రన్ సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఎస్ జే సూర్య ఈ మూవీలో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అంతేకాదు ప్రమాదం జరిగన సమయంలో హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటననకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు ఈ ప్రమాద ఘటనతో షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై హీరో కార్తీక్, దర్శకుడు పీఎస్ మిత్రన్ నుండి ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే వెలువడలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: