కొన్ని రోజుల క్రితం హిందీలో కిల్ అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతుంది. ఇకపోతే ఈ సినిమాలో కథ పెద్దగా ఏమీ లేకపోయినా స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓకే ట్రైన్ లో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ కొనసాగడం, వాటిని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇకపోతే హిందీ లో విడుదల అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను సౌత్ భాషలలో రీమేక్ చేయాలని ఓ హిందీ ప్రముఖ నిర్మాత భావిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు. ఈయన కిల్ మూవీ ని సౌత్ భాషలో అయినటువంటి తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ భాషలలో తేరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ని సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరితో చేయాలి అని ఈ నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా కరుణ్ జోహార్ సౌత్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి అడవి శేషు , ధనుష్ , సుదీర్ బాబు ముగ్గురుని ప్రస్తుతం ఈ రీమేక్ మూవీ లో హీరోలుగా అనుకుంటున్నట్లు , అందులో ఎవరో ఒకరితో ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఈ నిర్మాత ఉన్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలకు సంబంధించి ఇప్పటి వరకు కరణ్ జోహార్ నుండి మాత్రం అధికారిక ప్రకటన వెలువడలేదు.