దేవర సెకండ్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమాలలో "దేవర" కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మాస్ ఆడియన్స్ తో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు. షూటింగ్ తో పాటు ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ఏకకాలంలో జరుపుకుంటుంది. 

ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సాలిడ్ హిట్ అయింది. దాంతో ఈ సినిమా నుంచి విడుదలయ్యే రెండో పాట కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ రెండో పాటపై బజ్  వినిపిస్తోంది. అదేంటంటే... బజ్ ప్రకారం చూస్తే ఈ సాంగ్ ని వచ్చే వారంలో రిలీజ్  చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దానితో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమాకి అనిరుద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

 అంతే కాకుండా ఎన్టీఆర్ ఆర్ట్స్. యువసుధ ఆర్ట్స్ పథకంపై ఈ సినిమా నిర్మాణం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు మేకర్స్. ఆర్ ఆర్ ఆర్  వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వస్తుండడం తో ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాతో ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంతటి భారీ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: