మహేష్ ఎఫెక్ట్: అప్పుడే అలాంటి సినిమాలు చేయడానికి రెడీ అయిన మీనాక్షి చౌదరి..!?

Anilkumar
టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. గుంటూరు కారం సినిమా తర్వాత తనికి వరుస సినిమాల అవకాశాలు వస్తున్నాయి. ఏకంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలతోనే కాకుండా కోలివుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. రెండు భాషల్లోనూ దాదాపుగా ఐదారు సినిమాలకి పైగానే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ భామ. మెగాస్టార్ హీరోగా నటిస్తున్న విశ్వంభర  సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ తాజాగా ఈ బ్యూటీ మరో లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ ఇచ్చినట్లుగా

 తెలుస్తోంది. ఒక కోలీవుడ్ సినిమా లో ఈమె నటించే అద్భుతమైన అవకాశాన్ని అందుకున్నట్లుగా సమాచారం. మెయిన్ లీడ్ లో టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి v ను ఎంపిక చేసినట్లుగా సమాచారం వినబడుతోంది. 'డీడీ రిటర్న్స్' కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని ఎస్ ప్రేమ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. తొలుత మెయిన్ లీడ్ కోసం కొంత మంది భామల్ని పరిశీలించి చివరిగా ఆపాత్రకు మీనాక్షి సూట్ అవు తుందని ఫైనల్ చేసారుట. ఇదొక హారర్ కామెడీ నేపథ్యంతో కూడిన చిత్రమని తెలుస్తోంది. మొదటి భాగం అదే నేపథ్యంతో తెరకెక్కించి హిట్ అందుకున్నారు.

టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి  కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి ఛాన్స్ అందుకోవడం విశేషం. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు ప్రమోట్
 అవ్వాలంటే? చాలా సినిమాల్లో పనిచేసి ఉండాలి. స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసిన అనుభవం అవసరం. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటగలగాలి. ఈ విషయంలో టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇంకా ఎదిగే దశలో ఉంది. అయితే ప్రస్తుతం ఈ భామ తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: