అంబానీ ఇంట పెళ్లి బాజాలు: క్యూ కడుతున్న స్టార్స్.. మహేష్ కూడా అక్కడికేనా..!?

Anilkumar
ప్రపంచ కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక వివాహ మహోత్సవం ఈరోజు అట్టహాసంగా జరగబోతోంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ వేడుకలలో శుక్రవారం అనంత్ అంబానీ రాధిక ఇద్దరు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇందులో భాగంగానే ఈ పెళ్లి వేడుక చూడడం కోసం వివిధ దేశాల నుండి ప్రముఖ సినీ నటులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అందరూ అతిథులుగా వచ్చి కొత్త జంటను ఆశీర్వదించబోతున్నారు. ఇప్పటికే చాలామంది పారిశ్రామికవేత్తలు హాలీవుడ్ తారలు సైతం

 వచ్చి నవ దంపతులను ఆశీర్వదిస్తున్నారు. ప్రియాంక చోప్రా వంటి స్టార్ సెలబ్రిటీస్ సైతం ఈ వేడుకకు హాజరవుతున్నారు. వచ్చి నవ దంపతులను ఆశీర్వదిస్తున్నారు.  అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక హీరో మాత్రమే వెళ్లనున్నట్లు ముందు నుంచి టాక్ నడిచింది. అతడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గురువారమే భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి ముంబై చేరుకున్నారు రామ్ చరణ్.  అయితే తాజాగా
 ఈరోజు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలకు సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంతో

 సహా హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు. ఇదిలా ఉంటే.. గత రెండు వారాలుగా విదేశాల్లోనే ఉన్నారు మహేష్. ఫ్యామిలీతో కలిసి లండన్, జర్మనీ వెకేషన్ వెళ్లిన మహేష్.. రెండు రోజుల క్రితమే తిరిగొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు వెళ్తున్న మహేష్ న్యూలుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా లాంగ్ హెయిర్, గడ్డంతో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపిస్తున్నాడు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: