Filmfare Awards 2023: చరణ్, ఎన్టీఆర్ లలో బెస్ట్ యాక్టర్ ఎవరంటే..!?

Anilkumar
68 వ సౌత్ ఇండియన్ ఫిలింఫేర్ అవార్డ్స్ తాజాగా ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో అత్యధిక విభాగాల్లో అవార్డులో సాధించుకున్న సినిమాలుగా త్రిబుల్ ఆర్ సీతారామం సినిమాలు నిలిచాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2022లో విడుదలై ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13వేల కోట్లకు పైగా అనే వస్తువులను రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. తాజాగా ఇప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్ 2020 3 లో త్రిబుల్ ఆర్ సినిమా ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులను గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ సినిమా ఉత్తమ నటుడు ఉత్తమ డైరెక్టర్

 వంటి ప్రధాన విభాగాల్లో విజయం సాధించడంతో తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతో సంతోషిస్తున్నారు. ఉత్తమ సినిమాగా త్రిబుల్ ఆర్ సినిమా నిలవడంతో తెలుగు సినిమాల గొప్పతనం ఏంటో మరోసారి రుజువయింది. ఉత్తమ నటుడు అవార్డు సైతం త్రిబుల్ ఆర్ సినిమాకి రావడంతో నందమూరి మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. మరి ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరికి దక్కిందో తెలుసా?... ఈ అవార్డు ఇద్దరికీ సంయుక్తంగా ఇచ్చారు. ఉత్తమ నటులుగా ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంపికయ్యారు. ఆర్ ఆర్ ఆర్ వలె సీతారామం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో హవా సాగించింది. 5 విభాగాల్లో సీతారామం అవార్డులు

 అందుకుంది. ఉత్తమ నటి అవార్డు మృణాల్ ఠాకూర్ కి దక్కడం విశేషం. దుల్కర్ సల్మాన్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. గత ఏడాది అనివార్య కారణాలతో ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల ప్రకటన జరగలేదు. దాంతో 2022లో విడుదలైన చిత్రాలకు ఈ ఏడాది ప్రకటించారు.

ఉత్తమ చిత్రం
RRR
ఉత్తమ దర్శకుడు
S. S. రాజమౌళి (RRR)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)
సీతారామం (హను రాఘవపూడి)
ఉత్తమ నటుడు
ఎన్.టి.ఆర్. JR (RRR)
రామ్ చరణ్ (RRR)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్')
దుల్కర్ సల్మాన్ (సీతారామం)
ఉత్తమ నటి
మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్)
సాయి పల్లవి (విరాట పర్వం)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: