దేవర సెకండ్ సింగిల్.. అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు జాన్వి కోసమేనా..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమాను యువ సుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరగగా చివరి దశకు చేరుకుంది.త్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ

 సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అయితే  ఇటీవల దేవర నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా సోషల్ మీడియాలో దుమ్ము లేపింది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. దేవర రిలీజ్ కి మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ సైతం భారీ ఎత్తున చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పుడు సెకండ్ సింగిల్ సైతం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సాంగ్ హీరోయిన్

 బేస్డ్ మీద కంప్లీట్ మెలోడియస్ గా ఉండబోతుందట.  అది కూడా పూర్తిగా ఫిమేల్ వాయిస్తూనే సాంగ్ ని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ మీద ఈ సాంగ్ ని చిత్రీకరించారంట. ఆమె పాయింట్ ఆఫ్ లో ఉండబోయే ఈ సాంగ్ ని సెకండ్ సింగిల్ గా ప్రేక్షకులకు అందించబోతున్నట్లుగా సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చిత్ర యూనిట్ నుంచి వస్తుందని టాక్ వినిపిస్తోంది. దేవర మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: