ఇండియన్ 2 ఓటిటి పార్ట్నర్ ఫిక్స్..!?

Anilkumar
లోక నాయకుడు కమలహాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ టు సినిమా జులై 12న థియేటర్స్లోకి వచ్చింది. తెలుగులోనే కాకుండా కన్నడ మలయాళం హిందీ వంటి భాషల్లో కూడా విడుదల అయింది. అయితే ఇంత పెద్ద కోలీవుడ్ సినిమా విడుదలై చాలా కాలమే అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇవాళ ఇండియన్ టు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.  లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాని పాత్రలో నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఆమెతో పాటు సిద్ధార్థ ప్రియా భవాని శంకర్ సముద్రఖని ఎస్ జె సూర్య బాబి సింహ

 తదితరులు కీలకపాత్రలో కనిపించారు. లైక  ప్రొడక్షన్స్ రెడ్ జాయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించారు. అయితే దాదాపుగా 28 సంవత్సరాల క్రిందట వచ్చిన భారతీయుడు సినిమాకి సిక్వల్ గా దీన్ని తీశారు. ఇండియన్ టు ను ఇండియన్ వన్ కంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడంతో మొదటి నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నేడు విడుదలైన సినిమాపై ప్రెకషకులనుండి ఎక్కువుగా పాజిటివ్ టాక్ వినిపిస్తున్న., అక్కడక్కడా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. చూడాలి మరి మొదటిరోజు పూర్తి అయ్యేసరికి సినీ అభిమానులు ఎటు వైపు

 తీర్మానము ఇస్తారో. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఇండియన్ 2 సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తమిళం తోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఇండియన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఇక సినిమా స్ట్రీమింగ్ డేట్ సంబంధించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు. నేడు విడుదల అయిన ఈ సినిమాలో అనుకనట్లుగానే సినిమా చివరిలో మరో 6 నెలలో విడుదల కాబోతున్న ఇండియన్ 3 సినిమా ట్రైలర్ ను ప్రదర్శించారు. ఈ ట్రైలర్ లో నటుడు కమల్ హాసన్ కొత్త అవతారం లో కనపడ్డాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: