నబా నటేష్ చాలా స్ట్రాంగ్.. ఆ విషయం గురించి చెప్తూ ఆమె గొప్పతనాన్ని వివరించిన విశ్వక్ సేన్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటీమణులలో నభ నటేష్ ఒకరు. ఈమె నన్ను దోచుకుందువటే అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఈమె డిస్కో రాజా అనే మరో తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకోలేదు. అలా ఈమె వరసగా రెండు తెలుగు సినిమాలతో రెండు అపజాలను అందుకున్న తర్వాత ఈస్మార్ట్ శంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా అవకాశాలు తెలుగులో వచ్చాయి. ఇలా వరుసగా అపజయాలు వస్తున్న సమయం లోనే ఈమెకు ఒక యాక్సిడెంట్ జరిగింది. దానితో ఈమె చాలా కాలం పాటు రెస్ట్ తీసుకుంది. కొంత కాలం పాటు రెస్టు తీసుకున్న ఈమె మళ్లీ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈమె డార్లింగ్ అనే సినిమాను పూర్తి చేసింది. ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే డార్లింగ్ సినిమా జులై 19 వ తేదీన విడుదల కానుంది.

ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కోసం ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దానికి విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ... నబా నటేష్ చాలా స్ట్రాంగ్. ఎందుకు అంటే చిన్న చిన్న విషయాలకే మనం జీవితం అయిపోయింది అని లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ నబా నటేష్ కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో యాక్సిడెంట్ కు గురైంది. దానితో ఆమె కొంత కాలం రెస్టు తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆమె వాటన్నింటి నుండి బయటకు వచ్చి సినిమాలలో నటిస్తుంది. అందుకే ఆమె చాలా స్ట్రాంగ్ అని ఆయన చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: