ఇదెక్కడి మాస్ రా మావా.. జై హనుమాన్ లో ప్రభాస్.. కానీ జస్ట్ మిస్..!?

Anilkumar
తేజ సజ్జ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకుంది. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా దాదాపుగా 350 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు ఆ ఏడాదిలో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్ వసులు  చేసిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ బద్దలు కొట్టింది. అంతేకాకుండా టాలీవుడ్ చరిత్రలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిన్న బడ్జెట్ సినిమాగా కూడా

 చరిత్ర సృష్టించింది హనుమాన్ సినిమా. ఇకపోతే ఈ సినిమాని డివోషనల్ బ్యాగ్ డ్రాప్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ భారీ అంచనాలతో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ టేకింగ్ విజువల్ ఎఫెక్ట్ యాక్షన్ సన్నివేశాలు మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి. వీటివల్లే ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకోగలిగింది. అయితే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వల్ కూడా ఉందని ప్రకటించాడు దర్శకుడు. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ఉండబోతోంది అంటూ అనౌన్స్ చేశాడు. ఇకపోతే ఎప్పుడైతే సీక్వెల్

 ఉంటుంది అని ప్రకటించాడో అప్పటి నుండి  జై హనుమాన్ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు జై హనుమాన్ లో స్టార్ హీరోలు కనిపించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మరి ఆ విషయాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా ఈ హనుమాన్ సీక్వెల్‌పై ప్రొడ్యూసర్ చైతన్యరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేసింది. డార్లింగ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జై హనుమాన్ గురించి ఆమె మాట్లాడుతూ ఈ సీక్వెల్‌లో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవి, రామ్‌చరణ్‌లను అనుకుంటున్నట్లు తెలిపింది.  అలాగే డార్లింగ్ సినిమా ప్రమోషన్స్‌కు ప్రభాస్‌ను తీసుకురావాలని అనుకున్నామని, కానీ కల్కి సినిమాతో ఆయన బిజీగా ఉండటంతో కుదరలేదని చైతన్య రెడ్డి పేర్కొన్నది. నా పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రకారం వారయితేనే బాగుంటుందని అనిపిస్తుందని చెప్పింది. హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారన్నది ఇంకా ఫైనల్ కాలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: