కల్కి2 పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
గత గురువారం విడుదలైన ‘కల్కి2898’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈమూవీ కలక్షన్స్ చాలబాగున్నాయి. ఈ కలక్షన్స్ ఇలా కొనసాగితే ఈవారం చివరికి బయ్యర్లు లాభాల బాట పడతారు అని అంటున్నారు. ఈసినిమా కథలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ సగటు ప్రేక్షకులు ఆవిషయాన్ని పట్టించుకోకుండా ఈమూవీ గ్రాఫిక్స్ మాయాజాలంలో ఈమూవీ కథ గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు.

ఈమూవీని ప్రమోట్ చేస్తూ నిర్మాత అశ్వనీ దత్ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోయే ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు. ‘కల్కి’ సినిమాను మొదలుపెట్టినప్పుడు ఈసినిమాకు సెకండ్ పార్ట్ అనుకోలేదని అయితే ఈమూవీ కథ చాల పెద్దది అవ్వడంతో సెకండ్ పార్ట్ ఆలోచనలు వచ్చిన విషయాన్ని వివరించాడు. ‘కల్కి-2’ చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తి అయిందని ఈ సీక్వెల్ కు సంబంధించిన కొన్ని ముఖ్య సన్నివేశాలు ఇప్పటికే తీశారని మరికొన్ని ముఖ్య సన్నివేశాలు తీయవలసి ఉందని తెలియచేశారు.

అన్నీ అనుకూలిస్తే వచ్చే సంవత్సరం సమ్మర్ కు ‘కల్కి 2’ విడుదల ఉండవచ్చును అన్న సంకేతాలు కూడ ఈనిర్మాత ఇస్తున్నాడు. ‘కల్కి’ పార్ట్-1లో ప్రభాస్ పాత్ర చాలావరకు నెగెటివ్ షేడ్స్‌ తో కనిపిస్తే పార్ట్ 2 లో ప్రభాస్ భైరవ పాత్రలో మార్పు వచ్చి సుప్రీమ్ యాస్కిన్ మీద పోరాడే నేపథ్యంలో పార్ట్ 2 కథ నడుస్తుంది అన్న లీకులు అశ్వనీ దత్ ఇంటర్వ్యూలో కనిపిస్తున్నాయి.

ప్రభాస్ కమల్ మధ్య ఎపిక్ క్లాష్‌ ను రెండవ భాగంలో చూపెడతామని ఆసీన్స్ ‘కల్కి’ పార్ట్ 2ను మరింత ఎలివేట్ చేస్తాయి అని ఈమూవీ నిర్మాత అంటున్నారు. ఇప్పుడు ఈన్యూస్ ప్రభాస్ అభిమానుల దృష్టి వరకు వెళ్లడంతో అప్పుడే ‘కల్కి 2’ పై అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈమూవీ కలక్షన్స్ కు సంబంధించి అసలు పరీక్ష వీకెండ్ పూర్తి అవ్వడంతో ఈరోజు నుండి అసలు పరిస్థితి బయటకు వచ్చే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: