బాలయ్య 109 సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ..!?

Anilkumar
నందమూరి నటసింహ బాలకృష్ణ ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకి పోటీగా వరుస సినిమాలను చేస్తున్నాడు. హిట్ల పై హిట్లు కొడుతూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు బాలయ్య బాబు. అఖండ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగానే నిలిచాయి.  తాజాగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తన 109వ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే

 బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఈ సినిమా నుంచి అధికారికంగా బాలయ్య మినహా ఒక బాబీ డియోల్ విషయంపై మాత్రమే సినిమా కాస్ట్ లో ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఉన్నట్లు స్వయంగా తానే తెలిపింది. కానీ ఈ సినిమాలో నందమూరి నటసింహ బాలకృష్ణ  కు జోడిగా నటించే మెయిన్ హీరోయిన్ ఎవరు అనేదానిపై ఇంకా మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ

 విషయంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అదేంటంటే సెన్సేషనల్ హిట్ "అఖండ" మూవీ హీరోయిన్ తో కలిసి నందమూరి నటసింహ బాలకృష్ణ  మరోసారి తెరమీదకి రాబోతున్నట్లు బజ్ వినిపిస్తోంది. తాజాగా ప్రగ్య జైస్వాల్ ఒక ఇన్స్టా స్టోరీ పెట్టింది. ఇక అందులో నందమూరి నటసింహ బాలకృష్ణ  నటిస్తున్న 109వ సినిమా షూటింగ్ ఆ పోస్ట్ తో మ్యాచ్ అవ్వడంతో ప్రగ్య జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడంతో.. ఎన్బీకె 109 పై భారీ అంచనాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: