కల్కి 2898 AD : 3వ రోజు నైజాం.. కృష్ణా.. గుంటూరు కలెక్షన్స్ ఇవే..?

MADDIBOINA AJAY KUMAR
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాలలో సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. అందులో భాగంగా3 వ రోజు ఈ సినిమాకు నైజాం , కృష్ణ , గుంటూరు ఏరియాలలో కూడా అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి. ఇకపోతే 3 వ రోజు ఈ మూడు ఏరియాలలో ఈ సినిమాకు ఏ స్థాయి కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
నైజాం ఏరియాలో 3 వ రోజు ఈ సినిమాకు GST తో కలిపి 9 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
కృష్ణ ఏరియాలో ఈ మూవీ కి 3 వ రోజు  99.33 కలెక్షన్లు GST తో కలిపి వచ్చినట్లు తెలుస్తుంది.
ఇక గుంటూరు లో ఈ మూవీ కి 3 వ GST తో కలిపి 99.65 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా ఈ మూడు ఏరియాలో ఈ సినిమాకి విడుదల అయిన 3 వ రోజు మంచి కలెక్షన్లు వసూలు అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు ఆదివారం హాలిడే కావడంతో ఈ సినిమాకు ఈ మూడు ఏరియాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రోజు ఈ సినిమాకు ఏ స్థాయి కలెక్షన్లు వస్తాయో చూడాలి.
ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్గా నటించగా , అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ మృనాల్ ఠాగూర్ , శోభన , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ ఈ మూవీ లలో ముఖ్య పాత్రలో నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: