హైద‌రాబాద్ ఐమ్యాక్స్ కనబడడంలేదు... ఏమైంది?

Suma Kallamadi
హైద‌రాబాద్ ఐమ్యాక్స్ ఫార్మెట్ లో తమకి నచ్చిన సినిమా చూడడం అంటే ప్రతీ సగటు సినిమా ప్రేక్షకుడికి ఓ అంతులేని అనుభూతి. అందుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది హైద‌రాబాద్ ప్ర‌సాద్ ఐమ్యాక్స్ నిలిచింది. అందులో తెలుగు సినిమాలనే కాకుండా ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసి ప్రేక్ష‌కులు ఐమ్యాక్స్ అనుభూతిని పొందారు అనడంలో అతిశయోక్తి లేదు. అవ‌తార్ లాంటి సినిమా అందులో ఏకంగా ఏడాది పాటుగా ఆడి రికార్డులు సృష్టించింది. కేవ‌ల ఐమ్యాక్స్ కార‌ణంగానే అంత గొప్ప‌గా ఆ సినిమా ఆడింద‌ని అప్ప‌ట్లో సంస్థ అధినేతనే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. అయితే కాల క్ర‌మంలో అది బిగ్ స్క్రీన్ గా మారింది. దానికి పీసీఎక్స్ గా నామ‌క‌ర‌ణం చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్ర‌సాద్స్ క‌ళ త‌ప్పింది అనే విమర్శలు ఉన్నాయి.
అవును, మెట్రో నగరాలైన చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్ క‌త్తా లాంటి ప్ర‌దేశాల్లో కూడా మ‌న హైద‌రాబాలో ఉన్న విధంగా ఐమాక్స్ లేద‌నే భావన చాలా మందిలో ఉంది. కానీ ఆ ఫీలింగ్ ఇపుడు లేదు. ఐమ్యాక్స్ చెప్పుకోవడానికే తప్పించి, అక్కడ ఆ అనుభూతి కనబడడంలేదు. మొన్న రిలీజ్ అయిన క‌ల్కి 2898 ఐమ్యాక్స్ లో చూస్తే ఆ కిక్కే వేరుగా ఉండేది. ఈ క్రమంలోనే మ‌ళ్లీ హైద‌రాబాద్ కి ఐమ్యాక్స్ రాబోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అవును, ఇది ఓ రకంగా సినిమా ప్రేక్షకులకు ఓ వరం. పంజాగుట్ట పరిధిలో ఉన్న రెండు పివిఆర్ మల్టీప్లెక్స్ సముదాయం ఐమ్యాక్స్ ఏర్పాటు కు ప‌రిశీలిస్తున్న‌ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
విషయం ఏమిటంటే... గ‌త ప్ర‌భుత్వ హయాంలోనే ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎన్నిక‌లు.. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు వంటి అంశాల కార‌ణంగా డిలే అయిన‌ట్లు సమాచారం. ఇక తాజాగా అవ‌న్నీ ఓ కొలిక్కి రావ‌డంతో మ‌ళ్లీ ఐ మ్యాక్స్ ఏర్పాటు ప‌నులు స్టార్ట్ అవుతున్నాయని స‌మాచారం. అదే జ‌రిగితే హైద‌రాబాద్ వాసులకు ఇక ఆ వెలితి తీరినట్టే అవుతుంది. అవును, న‌గ‌రంలో మల్టీప్లెక్స్ లు జోరు చాలా స్పీడుగా విస్త‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నేరుగా స్టార్ హీరోలే వ్యాపారంలోకి దిగ‌డంతో మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ ఇపుడు వేరే లెవల్ లో ఉండబోతోంది. కార్పోరేట్ కంపెనీలు కోట్లాది రూపాయ‌ల‌తో అధునాత‌న స‌దుపాయాల‌తో నిర్మిస్తున్నాయి. ఐమ్యాక్స్ ఏర్పాటు జ‌రిగితే గ‌నుక టికెట్ ధ‌ర్ కూడా అధికంగానే ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: