సినీ చరిత్రలోనే కని విని ఎరగని కాంబో.. సుకుమార్ డైరెక్షన్లో స్టార్ హీరో మూవీ..!
ప్రజెంట్ ఈ డైరెక్టర్ అల్లు అర్జున్తో పుష్ప కి సీక్వెల్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ ఆరవ తేదీన రిలీజ్ కాబోతుంది. అయితే సుకుమార్ ఈ మూవీ అనంతరం రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ మూవీ రంగస్థలం టూ గా రాబోతుంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే రామ్ చరణ్ తర్వాత సుకుమార్ క్రేజీ హీరోతో మూవీకి కమిట్ అయ్యాడు అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
ఆ హీరో మరెవరో కాదు కల్కి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రభాస్. ఎస్ ఈ ఆరడుగుల అందగాడితో సుకుమార్ లవ్ స్టోరీ మూవీ తెరకెక్కించబోతున్నాడట. కల్కి సినిమా చూసి ఇంప్రెస్స్ అయిపోయిన సుకుమార్ స్వయంగా డార్లింగ్ కు ఫోన్ చేసి మరి స్పెషల్ విషెస్ తెలియజేసిందే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్టుకు కమిట్ అయ్యేలా చేసుకున్నాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. కల్కి సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడు డార్లింగ్. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు క్లారిటీ రాబోతుందో వేచి చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ ఆరవ తేదీన రిలీజ్ కాబోతుంది.