కల్కి 2898AD: తొలి రోజు దెబ్బ‌కొట్టిందెవరు... రు. 200 కోట్లు రావాల్సిన క‌లెక్ష‌న్లు ఎందుకు త‌గ్గాయ్‌..?

RAMAKRISHNA S.S.
ఎట్ట‌కేల‌కు క‌ల్కి సినిమా నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ నిన్న థియేట‌ర్ల లోకి దిగింది. క‌ల్కి సినిమా కు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 370 కోట్ల షేర్ రావాలి.. అప్పుడే ఈ సినిమా హిట్ అయిన‌ట్ల‌వుతుంది. తొలి రోజు క‌ల్కికి వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 180 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల ప్రాథ‌మిక లెక్క‌లు చెపుతున్నాయి. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. ఇక ఇండియాలో రు. 115 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌స్తే.. నెట్ అయితే రు. 95 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెపుతున్నాయి. బాలీవుడ్ లో రు. 24 కోట్ల రేంజ్‌లో ఫ‌స్ట్ డే వ‌సూళ్లు ఉంటాయ‌ని తెలుస్తోంది.

ఇక నార్త్ అమెరికాలో కేవ‌లం ప్రీమియ‌ర్ల తోనే ఏకంగా 4 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన క‌ల్కి ఫ‌స్ట్ డే ముగిసే టైంకు మొత్తం 5. 5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో ఆల్ టైం టాలీవుడ్‌ రికార్డు సెట్ చేసింది. ఇదిలా ఉంటే ఏపీ తో పాటు ఇటు తెలంగాణ లోనూ తొలి రోజు అద‌నపు షోల‌కు ప‌ర్మిష‌న్లు ఇచ్చారు. టిక్కెట్ రేట్లు కూడా భారీగా పెంచుకునే వెసులు బాటు ఉంది. తొలి రోజు సినిమాకు అదిరిపోయే టాక్ వ‌చ్చింది.. చాలా థియేట‌ర్ల‌లో సినిమా ప్ర‌ద‌ర్శించారు.

అయినా కూడా ఈ క‌ల్కి సినిమా కు తొలి రోజు రు. 200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు ఎందుకు రాలేదు అన్న‌ది చ‌ర్చ‌నీయాంశ మైంది. అయితే దీనికి ఓ కార‌ణం కూడా క‌నిపిస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR సినిమా ల్లాగా ప్రమోట్ చేయడంలో యూనిట్‌ వెనుకబడిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ ఉంద‌ని.. అది యూనిట్ మిస్ చేసుకుంద‌ని అంటున్నారు.

దీనికి తోడు క‌ల్కి సినిమా కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. గ‌త రాత్రి  జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఆడియెన్స్ మొగ్గు చూపడం తో క‌లెక్ష‌న్లు కొంత వ‌ర‌కు త‌గ్గాయంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: