చిరు లిస్ట్ రోజురోజుకీ పెరిగిపోతుంది... కానీ ఒక్క అఫీషియల్ స్టేట్మెంట్ కూడా లేదు..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి పోయిన పుట్టిన రోజు సందర్భంగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ఓ మూవీలోను , కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీలోను నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మల్లాడి వశిష్ట ప్రాజెక్టు మాత్రం ముందుకు సాగింది. అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇక చిరంజీవి "విశ్వంబర" సినిమాతో పాటు మరో మూవీ ని స్టార్ట్ చేయాలి అని చూసిన కూడా అది కుదరడం లేదు. కొంత కాలం క్రితమే మోహన్ రాజా , చిరంజీవి కి ఓ కథను వినిపించాడు అని , ఆ కథ చిరు కి అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతుంది అని ఒక వార్త వైరల్ అయింది. ఆ వార్త వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ , చిరు కి ఓ కథను వినిపించాడు అని , ఆయన చెప్పిన కథకు చిరు ఫిదా కావడంతో వెంటనే ఈ దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా తెలుగులో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ , చిరంజీవిని కలిశాడు. దానితో వెంటనే చిరు , వినాయక్ కాంబోలో మూవీ రాబోతుంది అంటూ వార్తలు మొదలు అయ్యాయి. ఇలా చిరు నెక్స్ట్ మూవీ కి సంబంధించి రోజుకో వార్త వస్తుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడడం లేదు. మరి చిరంజీవి తన తదుపరి మూవీ ని ఏ దర్శకుడితో చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: