హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీనటులు వీరే..!

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునేవారు ఎవరో ఒకరిని దాదాపుగా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. అలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి నటులుగా కెరియర్ను కొనసాగిస్తున్న కొంత మంది గురించి తెలుసుకుందాం. తెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సుహాస్ ఒకరు. ఈయన తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారట. ఆయనను చూసి సినిమాల్లోకి రావాలి అనుకోవడం , అందుకు తగిన ప్రయత్నాలు చేయడం , చివరగా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిందట.

ఇక ప్రస్తుతం సుహాస్ తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడు విజయ్ దేవరకొండ కూడా ఒక నటుడుని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీ కి వచ్చాడట. ఆ నటుడు ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. చిన్న తనంలో ఉన్నప్పుడు మహేష్ బాబు హీరోగా రూపొందిన పోకిరి సినిమా చూసి తాను కూడా హీరో అవ్వాలి అని అనుకున్నాడట. ఆ తర్వాత పెద్దయ్యాక సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడట.

ఇకపోతే సాయి పల్లవి ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈమె గొప్ప డాన్సర్ కూడా. ఇక ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ముఠా మేస్త్రి సినిమాలో ఆయన చేసిన డ్యాన్స్ లను చూసి ఇండస్ట్రీ లోకి వెళ్లాలి అని అనుకుందట. ఇక ఆ తర్వాత ఇండస్ట్రి లోకి రావడానికి ప్రయత్నాలు చేయడం , అందులో సక్సెస్ కావడం జరిగిందట. ఇలా ఈ ముగ్గురు కూడా ఇండస్ట్రీ లోకి రావడానికి కొంత మంది ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: