కల్కి 2898AD: నార్త్ అమెరికాలో ఊచకోత..!

Divya
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రం నిన్నటి రోజు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్గా విడుదలయ్యింది. బాక్సాఫీస్ వద్ద కల్కి చిత్రం రారాజుగా అనిపించుకున్నది. సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ భారీ హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా భారీ స్థాయిలోనే బుకింగ్ అడ్వాన్స్ కూడా జరిగాయి.. మొదటి మూడు రోజులకే చాలా థియేటర్స్ సైతం హౌస్ ఫుల్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీగా ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా కల్కి చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ నార్త్ అమెరికాలో రెండు వారాలకు ముందే మొదలయ్యింది. దీంతో మూవీ ప్రీమియర్ షోలు ఫస్ట్ డే సినిమాను చూడాలనుకునేవారు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 26వ తేదీన నార్త్ అమెరికాలో కల్కి మూవీ ప్రీమియర్ షోలో పడడం జరిగింది వీటిల్లో అద్భుతమైన రెస్పాన్స్ కూడా లభించింది. కేవలం ప్రీమియర్స్ ద్వారానే నాట్ అమెరికాలో 3.9 మిలియన్ డాలర్ల కలెక్షన్ సైతం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే అత్యధిక ప్రీమియర్ కలెక్షన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విడుదలైన రోజే 1.5 మిలియన్ డాలర్ పైగా కలెక్షన్స్ గా రాబట్టిందట. ఇక ఓవరాలగా 5.5+ మిలియన్ డాలర్ల కలెక్షన్ కలిపి చిత్రం మొదటి రోజు రాబట్టినట్లు తెలుస్తోంది.. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదని సమాచారం. కల్కి మూవీ వరల్డ్ వైజ్ గా 180  కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను సైతం కల్కి మూవీ రాబడుతుందో చూడాలి మరి. మరి ఈ సినిమా కూడా త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. అమితాబచ్చన్, కమలహాసన్, దిశా పటానీ, దీపికా పదుకొనే , రాజేంద్రప్రసాద్ తదితర నటీనటుల సైతం నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: