మొదటిసారి డీసెంట్ టిఆర్పిను సొంతం చేసుకున్న "ఫ్యామిలీ స్టార్".. కానీ అదే ప్రాబ్లం..?

MADDIBOINA AJAY KUMAR
కొంత కాలం క్రితం టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ "ది ఫ్యామిలీ స్టార్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ కంటే ముందు విజయ్ దేవరకొండ , పరుశురామ్ కాంబినేషన్ లో గీత గోవిందం అనే మూవీ రూపొంది అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించి ఉండడంతో ది ఫ్యామిలీ స్టార్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండకు నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రచారం అయింది.

ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని వరల్డ్ లో టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయగా ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 6.11 టి ఆర్ పి రేటింగ్ దక్కింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్న ఈ సినిమాకు మొదటి సారి ప్రసారం అయినప్పుడు 6.11 టి ఆర్ పి రేటింగ్ అనేది మంచి విషయం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: