కమల్ హాసన్ : ఇండియన్ సినిమా చేయడం ఇష్టంలేక అలా చెప్పాను..

murali krishna
విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఎంతో  గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే ఈ సినిమాలో ఎస్. జె. సూర్య, సముద్రఖని, బాబీ సింహ వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ గ్లింప్స్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గతంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్క్కింది.శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఇండియన్ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. 

ఇండియన్ 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా ఏళ్లు అవుతున్న సినిమా ఇన్నాళ్లకు పూర్తి చేశారు. రిలీజ్ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే ఇండియన్ సినిమాపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఇండియన్ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు తనకు ఆ సినిమాలో నటించడం ఇష్టం లేక.. సినిమాలో నెగిటివ్ రోల్ తను ఇంతకుముందే చేసినట్టుగా అనిపించి కాదనడం కుదరక రెమ్యూనరేషన్ పేరు చెప్పి తప్పించుకుందామని అనుకున్నారట. అప్పటివరకు ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ అడిగితే ఇవ్వలేమని చెప్పి వెళ్తారని అనుకున్నారట. కానీ కమల్ అడిగినంత పారితోషికం ఇస్తానని చెప్పడంతో ఇండియన్ సినిమా చేశారట.అలా ఇండియన్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమా సీక్వెల్ చేయడంపై స్పందించిన కమల్ అప్పటికన్నా ఇప్పుడు అవినీతి ఎక్కువైందని ఈ సినిమా కచ్చితంగా ప్రజల్లో మార్పు తెస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: