కల్కి 2898 AD : కల్కి గురించి స్పందించిన విజయ్ దేవరకొండ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటుడు తాజాగా కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో నటించాడు. ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ , కమల్ హాసన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ఈ రోజు అనగా జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన పాజిటివ్ టాక్ లభించింది.

ఇక ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పటికీ విజయ్ దేవరకొండ పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ మహాభారతంలో అర్జునుడి పాత్రను పోషించాడు. ఈ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన ప్రశంసలను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి పొందుతున్న నేపథ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి స్పందించాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి స్పందిస్తూ ... నాగి , ప్రభాస్ అన్న , వైజయంతి ఫిల్మ్ ... ఈ ప్రేమ , విజయానికి మీరు అర్హులు. మీ అందరి పట్ల చాలా సంతోషంగా ఉంది.

గాడ్ బ్లెస్స్ యు. అమితాబ్ , దీపిక , కమల్ వంటి వారు లేకపోతే కల్కి ఇలా ఉండేది కాదు. మనందరం వెళ్ళిపోయాక కూడా ఈ సినిమా చాలా కాలం గుర్తుంటుంది అని పేర్కొన్నారు. ఇక విజయ్ తాజాగా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగ్ అశ్విన్ "ఎవడే సుబ్రహ్మణ్యం" మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ ఈ కీలకమైన పాత్రలో నటించాడు. ఆ తర్వాత నాగి దర్శకత్వం వహించిన మహానటి సినిమాలో కూడా విజయ్  కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే తాజాగా కూడా ఈ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమాలో కూడా విజయ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: