"ఇండియన్ 2" స్టోరీని మరెవ్వరూ ఊహించలేరు.. కథ గురించి చిన్న హింట్ ఇచ్చిన కమల్..?

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఇక ఇండియన్ సినిమాను ఆ సమయంలో తెలుగులో భారతీయుడు అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ ని తెలుగులో భారతీయుడు 2 అనే పేరుతో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలు జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు అనేక ఇంటర్వ్యూలలో , టీవీ షో లలో పాల్గొంటూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఇండియన్ 2 మూవీ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా కమల్ మాట్లాడుతూ ... ఇండియన్ 2 సినిమా నుండి ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలు విడుదల అయ్యాయి. దానితో కొంత మంది ఇండియన్ 2 స్టోరీ ఇది అంటూ అనేక కథలను రాస్తున్నారు. వారి ఊహలు అన్ని తప్పు. వారు రాసిన దానికి ఇండియన్ 2 కథకు ఏ మాత్రం సంబంధం లేదు. ఈ సినిమా కథ మీ ఊహకు కూడా అందదు. అంత గొప్పగా ఉంటుంది. కాకపోతే మీరు రాస్తున్న కథలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అని కమల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: