సినిమాల్లో సిల్లీ కమెడీ..రాజకీయాల్లో బెబ్బులి..బాబు మోహన్‌ అంటే ఇదేరా ?

Veldandi Saikiran
* హస్యనటుడిగా గుర్తింపు
* టీడీపీలో రాజకీయ ఓనమాలు
* మంత్రిగా అనుభవం
* కేసీఆర్‌ కు సన్నిహితుడు
* రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు

మన టాలీవుడ్ ఇండస్ట్రీకి అలాగే...  రాజకీయాలకు అభినవ భావ సంబంధం ఉంది. సినిమాలు చేసిన... చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి కూడా వచ్చారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది... టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అయితే ఇలా రాజకీయాల్లోకి  వచ్చి సక్సెస్ అయిన నటుల్లో.. బాబు మోహన్ ఒకరు. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు బాబు మోహన్ మంచి కమెడియన్.

అప్పట్లో టీవీ పెట్టగానే బాబు మోహన్ సినిమాలో ఎక్కువగా వచ్చాయి. బుచ్కి బుచికి అంటూ... ఆయన కామెడీ చేసేవారు. 1986 సంవత్సరం నుంచి... ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు బాబు మోహన్. అయితే... నందమూరి తారక రామారావు... పార్టీ పెట్టినప్పుడే తెలుగుదేశం పార్టీలో చేరారు బాబు మోహన్. ఈ నేపథ్యంలోనే...  1999 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.

మెదక్ జిల్లా ఆందోల్  నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పని చేశారు బాబు మోహన్. అనంతరం... రాజకీయాల్లో కొనసాగిన కూడా పదవి రాలేదు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు బాబు మోహన్. 2014 సంవత్సరంలో ఆందోల్ నియోజకవర్గం నుంచి...బాబు మోహన్ మరోసారి విజయం సాధించారు.
అలా 2018 వరకు తన పదవీ కాలాన్ని కొనసాగించిన బాబు మోహన్... కెసిఆర్ కు నచ్చని పనులు చేయడంతో... 2018 అసెంబ్లీ ఎన్నికలకు గాను టికెట్  కు దూరమయ్యారు. దీంతో గులాబీ పార్టీకి రాజీనామా చేసిన బాబు మోహన్... ఆ తర్వాత బిజెపిలో చేరారు. అక్కడ ఎమ్మెల్యే టికెట్ దక్కిన కూడా... ఓడిపోయారు. ఇక మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో... కూడా బాబు మోహన్ ఓడిపోవడం జరిగింది.
 అక్కడ ఓడిపోవడంతో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి..  తన కొడుకుతో విభేదాలు పెట్టుకున్నారు. ఇక ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరారు బాబు మోహన్. ఇలా తన రాజకీయ ప్రస్థానంలో... కొంతమేర సక్సెస్ అయిన కూడా చివర్లో... వివాదాలకు తెర లేపారు. గులాబీ పార్టీలో ఉన్న సమయంలో.. కార్యకర్తలను తన్నబోయారు. దీంతో ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇటు బిజెపి పార్టీలో కూడా అదే వ్యవహారం  కొనసాగించిన బాబు మోహన్... ఇప్పుడు రాజకీయాలకి  దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఆయన ఏజ్ పై పడటంతో... ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: