ఏ రంగమైనా బాలయ్య దిగనంత వరకే.. టీడీపీలో ఆ రికార్డ్ బాలయ్యకే సొంతమా?

Reddy P Rajasekhar
సినిమాలు, రాజకీయాలు రెండూ వేర్వేరు రంగాలు కాగా ఈ రెండు రంగాల్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాని వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే రెండు పడవల మీద ప్రయాణం చేయడం వల్ల నష్టపోయిన వాళ్లు సైతం ఉన్నారు. అయితే బాలయ్య ఏ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ సాధించే వరకు వెనుకడుగు వేయరు. పరాజయాలు ఎదురైనా ఓపికగా ఎదురుచూసి బరువైన లక్ష్యాలను సైతం బాలయ్య అలవోకగా సాధిస్తారు.
 
టీడీపీలో హ్యాట్రిక్ సాధిన ఎమ్మెల్యేలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. చంద్రబాబు కాకుండా మూడుసార్లు విజయం సాధించిన అతికొద్ది మంది ఎమ్మెల్యేలలో బాలయ్య ఒకరు. ఎవరైనా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి కావాలని, ప్రాధాన్యత ఇవ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరతారు. అయితే బాలయ్య మాత్రం తనకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని భావిస్తారు.
 
హిందూపురం అభివృద్ధి కోసం బాలయ్య సొంత డబ్బులను ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి ఎమ్మెల్యేలు దేశంలోనే దాదాపుగా ఉండరు. ఏపీలో బసవతారకం ఆస్పత్రిని ఏర్పాటు చేస్తానని ప్రకటన చేసిన బాలయ్య తాజాగా అభిమానితో భోజనం చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బాలయ్య ఎంత ఎదిగినా సింపుల్ గానే ఉంటున్నారు.
 
64 సంవత్సరాల వయస్సులో సైతం బాలయ్య యాక్షన్ సీన్స్ అద్భుతంగా చేస్తూ డైలాగ్ డెలివరీతో మెప్పిస్తూ ఆకట్టుకుంటున్నారు. బాలయ్య యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ నటుడిగా ఎన్నో మెట్లు పైకి ఎక్కుతున్నారు. బాలయ్య భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఎదిగేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి. ఒకప్పుడు జగన్ సైతం బాలయ్య అభిమాని అనే సంగతి తెలిసిందే. బాలయ్య త్వరలో బాబీ సినిమాతో మరోమారు బాక్సాఫీస్ కచ్చితంగా షేక్ చేస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: