కోహ్లీ రిటైర్మెంట్‌ : టీమిండియా మొనగాడు..రికార్డుల రారాజు..నీలాంటోడు ఇక మళ్లీ రాడు ?

Veldandi Saikiran
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... సంచలన ప్రకటన చేశాడు. ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇస్తూ... టి20 లకు గుడ్ బై చెప్పేసాడు విరాట్ కోహ్లీ. టి20 ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో... ఇక తాను టి20 జట్టులో ఉండదలుచుకోలేదని... టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఇక విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో... ఆయన ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఒక లెజెండ్ ప్లేయర్... టి20 లకు దూరమవుతే... మేము భరించలేము అని అంటున్నారు.
అయితే... రెండోసారి టి20 వరల్డ్ కప్ టీం ఇండియా గెలిచిన నేపథ్యంలో... ఈ నిర్ణయం తీసుకున్న కోహ్లీ... ఇప్పటివరకు టి20  క్రికెట్ లో అనేక రికార్డులను... మైలురాళ్లను దాటాడు. 2010 సంవత్సరం జింబాబ్వే  జట్టుపై అరంగేట్రం చేశాడు విరాట్ కోహ్లీ.  అప్పుడే తన మొదటి టి20 మ్యాచ్ ఆడాడు. అలా ఓవరాల్ గా మొత్తం 125 టి20 మ్యాచ్ లు ఆడాడు విరాట్ కోహ్లీ.
ఈ 125 టి20 మ్యాచ్లలో... ఏకంగా 4,188 పరుగులు చేశారు. ఇందులో 137 స్ట్రైక్ రేట్ ఉండటం గమనార్హం. ఇక ఈ టి 20 ఫార్మేట్ లో  ఒక్క సెంచరీ మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ ఏకంగా... 38 హాఫ్ సెంచరీలను అందుకున్నాడు. ఈ టి 20 ఫార్మేట్ లో 122 పరుగులు  కోహ్లీ హైయెస్ట్ స్కోర్. అంతేకాకుండా... తన పొట్టి ఫార్మాట్ కెరీర్ లో ఏకంగా 369 ఫోర్లు...  124 సిక్సులు కొట్టాడు విరాట్ కోహ్లీ. చాలాసార్లు టీమిండియాను విజయ పథంలో నడిపించేందుకు విరాట్ కోహ్లీ చేసిన కృషి అంతా కాదు.
 అయితే ఈ తన సుదీర్ఘ కెరీర్లో... అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. టి20లకు అసలు విరాట్ కోహ్లీ పని చేయడానికి... చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఎక్కువ బంతులు ఆడి తక్కువ పరుగులు చేస్తాడని... అతనికి వన్డే మాత్రమే సూట్ అవుతుందని కొంతమంది అన్నారు. కానీ నిన్న జరిగిన టి20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో... అందరు విఫలమైన కీలక ఇన్నింగ్స్ ఆడి... ప్రపంచ కప్ విజేతగా టీమిండియాను నిలిపాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విరాట్ కోహ్లీ అని నిరూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: