థియేటర్ల వద్ద దుమ్ము రేపుతున్న కల్కి.. కంగ్రాట్స్ తెలియజేసిన నారా లోకేష్..!

lakhmi saranya
ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీని అశ్విని దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ మూవీకి సంబంధించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కల్కి సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
కల్కి చిత్రం గురించి అద్భుతమైన రివ్యూస్ వినడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్ అండ్ అమితాబచ్చన్ మరియు దీపికా పదుకొనే, కమల్ హాసన్ వంటి వారికి కంగ్రాట్స్ తెలియజేశాడు. అలాగే ఈ సినిమాని ఇండియన్ సినిమా ని రిసీఫైన్ చేసే సినిమాగా ఒక మాస్టర్ పీస్ రూపొందించేందుకు డైరెక్టర్ నాగలక్ష్మి కి కూడా ధన్యవాదాలు అంటూ చెప్పుకోవచ్చారు. అంతేకాకుండా అశ్విని దత్ కి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేశాడు నారా లోకేష్. ఇక స్వప్న, ప్రియాంక తెలుగు సినిమాకి సంబంధించిన కట్టుబాట్లను చెరిపేసి తెలుగు సినిమాని గ్లోబల్ లీగ్ లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కృషి చేశారని ఈ సందర్భంగా నారా లోకేష్ కామెంట్ చేశారు.
ఇక అశ్విని దత్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో కూడా ఆయన జైలుకు వెళ్లి పరామర్శించడం తెలుగుదేశానికి అండగానే ఉంటామంటూ చెప్పుకోచ్చా. ఇక ఆయన నిర్మించిన సినిమాకి హిట్ టాక్ రావడంతో నారా లోకేష్ అభినందిస్తూ ట్వీట్ చేయడం విశేషం. ప్రజెంట్ నారా లోకేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ కి నారా లోకేష్ వైపు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీని చూసేందుకు సామాన్య ప్రజలు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: