ఏపీ: వైజాగ్ నాయకుడిగా నారా లోకేష్?

Suma Kallamadi
చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ప్రస్తుతం 24 మంది మంత్రులు దాకా ఉన్నారు. వీరిలో ఒక్కో జిల్లాకు ముగ్గురేసి చొప్పున మంత్రులు ఉండగా కొన్ని జిల్లాలలో మాత్రం ఒక్కరికే స్థానం దక్కింది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో వంగలపూడి అనిత ఒక్కరే మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇకపోతే ఆమెకు ప్రాధాన్యత కలిగిన హోం శాఖను కట్టబెట్టారు మన బాబు. అయితే ఆమె కొత్తగా ఏర్పాటు చేసిన అనకాపల్లి జిల్లా కోటాలో మంత్రిగా ఉన్నపుడు విశాఖ జిల్లాకు మంత్రి ఎవరు? అన్న దానిపైన టీడీపీ నేతలు ఇపుడు కసరత్తులు చేస్తున్నట్టుగా కనబడుతోంది.
గతంలో వైసీపీ ప్రభుత్వం విషయంలో కూడా ఇలాగే అనకాపల్లి జిల్లాకే 2 మంత్రి పదవులూ ఇచ్చేసి విశాఖ జిల్లాను పక్కన పెట్టడం జరిగింది. అలా విశాఖకు మంత్రి లేరు? అని టీడీపీయే నాడు విమర్శలు చేయగా ఇపుడు టీడీపీ అదేమాదిరి వ్యవహరించడం సరికాదనే వాదనలు పార్టీలో బాగా వినిపిస్తున్నాయి. బాబు, విశాఖ పాలనా రాజధాని అంటూనే మంత్రి పదవి ఎందుకని ఇంకా పెండింగ్ లో పెట్టారనే విమర్శలు కూడా బయట వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ మంత్రిగా ఎవరూ లేరన్న కొరతను తీర్చేందుకు బాబు రంగంలో దిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రిగా నారా లోకేష్ ఉంటారని అంతా అనుకుంటున్నారు. విశాఖకు ఉన్న రాజకీయ ఆర్ధిక సామాజిక ప్రాధాన్యత రిత్యా నారా లోకేష్ జిల్లా మంత్రిగా వస్తారు అని పార్టీ నాయకులు కూడా ఆశిస్తున్నట్టు కనబడుతోంది.
ఇపుడు ఇదే విషయం ఇపుడు గురించి టీడీపీలో చర్చ నడుస్తోంది. విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి అంటే ఆయన చేతుల మీదుగానే అన్ని అభివృద్ధి పనులు ఇకనుండి జరగనున్నాయనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే జిల్లా ఇంచార్జి మంత్రి అంటే పవర్ ఫుల్ పోస్ట్ అని చెప్పాలి. పైగా విశాఖలోనే స్టీల్ ప్లాంట్, ఏయూ ఉంది. విశాఖ అంతా టీడీపీకీ మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేలను గెలిపించింది కాబట్టి విశాఖకు ఇపుడు టీడీపీ అండదండగా ఉండబోతోంది అనడంలో అతిశయోక్తి లేదు. దాంతో అన్ని విధాలుగా ప్రాముఖ్యత దృష్ట్యా లోకేష్ ఇంచార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: