మూవీ చూసి మాటలు రావడం లేదు.. కల్కి మూవీ పై ప్రశంసలు కురిపించిన బన్నీ..!?

Anilkumar
ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా కల్కి  అనే వేరే వినబడుతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 191 కోట్ల  పైగానే కలెక్షన్లను వసూలు చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తో ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు డైరెక్టర్. అంతేకాదు ఈ సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందని అంటున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలో అమితాబచ్చన్ కమలహాసన్

 పలు కీలక పాత్రలో కనిపించారు. వారితో పాటు చాలామంది సినీ సెలబ్రిటీలు అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అమితాబచ్చన్ యాక్టింగ్ గురించి అని చెప్పాలి. ఎందుకంటే ఈ వయసులో ఆయన ఎటువంటి ఒక పాత్రలో నటించడం చాలా పెద్ద విషయం. అలాగే భైరవ పాత్రలో ప్రభాస్ అదరగొట్టేసారు.  కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా. అయితే ఇందులో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ రాజమౌళి అనుదీప్ ఫారియ అబ్దుల్లా రాంగోపాల్ వర్మ మృనాల్ ఠాగూర్ ఇలా చాలామంది సినీ సెలబ్రిటీలు కనిపించారు.  తాజాగా కల్కి చిత్రయూనిట్ ను పొగడ్తలతో

 ముంచేత్తారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కల్కి చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ నోట్ రాసుకొచ్చారు. 'కల్కి మూవీ టీంకు నా అభినందనలు. అద్భుతమైన విజువల్ వండర్. ముఖ్యంగా నా మిత్రుడు ప్రభాస్ నటన అద్భుతం. ఇక అమితాబ్ బచ్చన్ గారి నటన గురించి మాటలు రావడం లేదు. కమల్ హాసన్, దీపికా, దిశా నటన గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా టోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్ బృందానికి, సాంకేతిక సిబ్బందికి అభినందనలు. ఇంత రిస్క్ తీసుకుని భారీతయ స్థాయిని పెంచినందుకు నిర్మాతలు అశ్వినీదత్, స్వప్నదత్, వైజయంతి మూవీస కు నా ధన్యవాదాలు. కల్కితో ప్రతి ఒక్క సినీ ప్రియుడుని ఆశ్చర్యానికి గురిచేశాడు నాగ్. మా తరానికి చెందిన దర్శకుడికి ప్రత్యేక అభినందనలు. చివరిగా ప్రపంచవ్యాప్తంగా స్థాయి ప్రమాణాలకు సరిపోయే మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన నే కల్కి' అంటూ రాసుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: