మరో పదేళ్ల పాటు ఏపీలో పవన్, అతడికి తిరుగు లేదు..??
2024 ఎన్నికల గెలుపుతో బాబు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇక పవన్ కళ్యాణ్ తన సగం జీవితాన్ని సినిమాలకి అంకితం చేశారు 30 ఏళ్లుగా ఈ హీరో సినిమాల్లో రాణిస్తూ వస్తున్నారు. రాజకీయంగా పదిహేనేళ్ల క్రితం యాక్టివ్ అయ్యారు. స్ట్రాటజీలు పన్నడంలో తాను గ్రేట్ అని పవన్ చూపించుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడటంలో పవన్ కీలక పాత్ర పోషించారు. కాపు సామాజిక వర్గం ఓట్లు అన్నీ పవన్ కే పడ్డాయి. కాపు, కమ్మ ఓట్లు అన్ని ఒకే పార్టీల వారికి పడటం బహుశా ఏపీ చరిత్రలోనే ఇదే తొలిసారి కావచ్చు.
పవన్ ఇగోని పక్కన పెట్టేసి టీడీపీతో పొత్తుకు పెట్టుకుని జస్ట్ 21 సీట్లతో సరిపెట్టుకున్నారు. 100% సక్సెస్ సాధించి చంద్రబాబు తర్వాత మళ్లీ అంతటి హోదా దక్కించుకున్నారు. బాబు పవన్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందించారు. జనసేన నేతలకు, పవన్ కళ్యాణ్ కు మంచి పదవులను ఆఫర్ చేశారు. గతంలో లాగా రక్త సంబంధాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా మిత్ర సంబంధాలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. పవన్ చంద్రబాబు మధ్య మంచి అవగాహన ఏర్పడినట్లు తెలుస్తోంది.
అందుకే పొత్తు ఉన్నా సరే ఎవరి లో ఇప్పుడు అసంతృప్తి కనిపించడం లేదు. పవన్, బాబు ఏ విషయంలోనూ మనస్పర్ధలు రాకుండా చాలా స్నేహంగా ముందు అడుగులు వేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎలాంటి పొరపొచ్చాలు ముందుకు సాగితే వచ్చే పదేళ్ల వరకు వాళ్లకి ఏ నేత కూడా సాటి రారు అని చెప్పుకోవచ్చు. ఇద్దరూ గౌరవం ఇచ్చుకుంటున్నారు ఇద్దరు తమ తెలివితో ఇతర నేతలను చిత్తుచేసే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ పదేళ్ల పాటు టీడీపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాన్ని బట్టి వీళ్లు 2029 వరకు ఏపీ రాజకీయాల్లో అధికారంలో ఉంటారని తెలుస్తోంది.