కల్కి 2898 AD: రాజమౌళి ర్యాంపేజ్.. ప్రభాస్ కంటే హైలైట్ అవుతున్నాడే?

Purushottham Vinay
పాన్ వరల్డ్ రేంజ్ లో సినీ ప్రియులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మోస్ట్ ఆవైటెడ్ ఫిల్మ్ కల్కి 2898 ఏడి తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాను చూసిన చాలా మంది కూడా సినిమాపై పాజిటివ్ గా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌ విజువల్స్, తెలివైన డైరెక్షన్‌.. అద్భుతమైన కంటెంట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భారీ లెవెల్ లో పాజిటివ్ టాక్ వినిపించింది. ఈ సినిమాతో ప్రభాస్ ఖచ్చితంగా మరోసారి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక భారీ తారాగణం అంతా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే కీలక పాత్రలో అదరగొట్టారు. ఇంకా కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాలో నటించి మెప్పించారు. ముఖ్యంగా టాప్ డైరెక్టర్ రాజమౌళి ఎంట్రీ థియేటర్లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. 


ప్రస్తుతం ప్రభాస్ కంటే ఎక్కువగా రాజమౌళి ఎంట్రన్స్ వీడియో లు బాగా ట్రెండ్ అవుతూ నెట్టింటా మారుమోగిపోతున్నాయి. రేయ్ భైరవ మళ్లీ దొరికావంటే ఈసారి పదేళ్లు తొక్కేస్తా అంటూ డైరెక్టర్ రాజమౌళి పవర్ ఫుల్ డైలాగ్.. ఎంట్రీ ప్రేక్షకులను ఎంతగానో సర్ప్రైజ్ చేసింది అంటున్నారు.దీనికి సంబంధించిన ఓ మినీ వీడియోను నెటిజన్స్ పోస్ట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. సినిమా చూసిన వారు వావ్ అంతే.. ఇలాంటి విజువల్ వండర్ ఇప్పటి దాకా అస్సలు చూసి ఉండరని అంటున్నారు. అమితాబ్, కమల్ హాసన్ అయితే సినిమాలో చాలా అద్భుతంగా నటించడమే కాకుండా తమ పాత్రల్లో జీవించారు. వారి క్యారెక్టర్లు సినిమాలో ఎంతో కీలకంగా ఉన్నాయి. సినిమాల్లో సర్ప్రైజ్ ల పైన సర్ప్రైజ్లు ఉంటాయి అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్. డైరెక్టర్ నాగ అశ్విన్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలంటూ చాలా మంది ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. నాగ అశ్విన్‌ ని తెగ పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: