కల్కి 2898 AD: పెద్ద మైనస్ లా మారిన విజయ్ దేవరకొండ?

Purushottham Vinay
కల్కి 2898 AD మూవీ నేడు విడుదల అయ్యి వరల్డ్ వైడ్ గా సూపర్ పాజిటివ్ టాక్ తో ఆగకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన జనాలు అందరూ కూడా పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఒక్క బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కూడా ఉందని జనాలు చెబుతున్నారు. తాజాగా విడుదలైన కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ పోషించిన పాత్ర ఆ హీరోకి అస్సలు సెట్ అవ్వలేదట. ఇంకా అంతేకాదు కల్కి మూవీ అంత పెద్ద హిట్ అయినప్పటికీ ఈ సినిమాలో ఆ హీరో ఆ పాత్రలో నటించడం మాత్రం సినిమాకి పెద్ద మైనస్ అంటూ సినిమా చూసిన జనాలు ఎక్స్ వేదికగా తమ రివ్యూలు ఇస్తున్నారు.కల్కి 2898 AD మూవీలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించారు. అయితే అర్జునుడి లుక్స్ లో విజయ్ దేవరకొండ అస్సలు బాలేడు అంటూ చాలామంది నెటిజన్స్ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇంకా అంతేకాదు అసలు ఆయనకు ఆ పాత్ర సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో లోని మహాభారతం రియల్ హీరో అర్జునుడి లాంటి ముఖ్యమైన పాత్రకి విజయ్ దేవరకొండను తీసుకొని డైరెక్టర్ నాగీ పెద్ద తప్పు చేశారని, ఈ మూవీకి ఇతనే పెద్ద మైనస్ అంటూ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. 


అసలు వీడిని సినిమాలో పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్ కి ఎందుకు వచ్చిందో..సినిమా మొత్తానికి పెద్ద మైనస్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెడితే మరో నెటిజన్ ఆ డైలాగ్ చెప్పడం ఏంట్రా తారు రోడ్డు మీద రేకు డబ్బా వేసి గీకినట్టు అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.విజయ్ డైలాగ్ డెలివరీ కూడా అస్సలు బాగోలేదు. చలికి గొంతు వణుకుతున్నట్టు ఆ డైలాగ్ చెప్పడం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అర్జునుడు లాంటి మహా గొప్ప క్యారెక్టర్ కి మంచి వాయిస్ బేస్ ఉన్న హీరో అయితే ఇంకా బాగా సెట్ అయ్యేవాడు అని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది నెటిజన్స్ అయితే వీడు రామబాణం వేయమంటే కామ బాణం వేస్తాడు ఏంటి వీడు అర్జునుడా.. అంటూ ఎక్స్ వేదికగా  విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర పై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సాధారణంగా విజయ్ యాక్టింగ్ పై అతని సినిమాల ఎంపికలపై సోషల్ మీడియాలో నెగటివిటీ ఉంటుంది. అదే ఇప్పుడు నాగీ కొంపముంచుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ చాలా దారుణంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: