క‌ల్కి 2898 AD : అందుకోస‌మైనా టిక్కెట్లు బుక్ చేయాల్సిందే...!

lakhmi saranya
నేడు అనగా జూన్ 27వ తారీకున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మూవీ కల్కి. ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే అండ్ దిశా పటాని వంటి స్టార్ నటీనటులు నటించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ మరియు అమితాబచ్చన్ కూడా ముఖ్యపాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కానీ ఈ మూవీలో భైరవ మెయిన్ లీడ్ అనుకుంటే అతిథి పాత్రగా కనిపించాడు. ఇది అభిమానులని ఆశ్చర్యపరిచిందనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ లో భైరవ పాత్ర చాలా ప్యాచ్ గా కనిపిస్తుంది. ఇక భైరవ ఎప్పుడు జోకులు వేయడం తప్ప పాత్ర లక్షణాలు లేదా ముఖ్యమైన సన్నివేశాలకు గల సీన్స్ ఏమీ కనిపించలేదు.
ఇక ఈ మూవీ లో ప్రభాస్ క్యారెక్టర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినా అమితాబచ్చన్ పాత్ర మాత్రం మూవీకి మెయిన్ హైలైట్ గా నిలిచింది. అతని స్క్రీన్ ప్రజెంట్స్‌ మరియు పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అమితాబచ్చన్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించాడు నాగ్ అశ్విన్. అయినా చాలా ఎనర్జిటిక్ గా యాక్టింగ్ చేస్తారు కనుక సినిమాలో ఆయన వయసు మనకి ఏ మాత్రం గుర్తుకు రాదు. ఇక కమల్ హాసన్ వంటి నటుడుకి తన స్క్రీన్ టైమింగ్ ద్వారా గణనీయమైన ప్రభావం చూపించేలా అనిపించినప్పటికీ ప్రభావం మాత్రం ఏమీ లేదు. అయితే అతని పాత్ర రెండవ భాగం కోసం రిసర్వ్ చేయబడిందని మేకర్స్ ఇప్పటికే చెప్పుకొచ్చారు.
ఇక దీపిక పదుకొనే గర్భిణీ ల్యాబ్ సబ్జెక్ట్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో దీపిక పదుకొనేది మెయిన్ లీడ్ రోల్ అయినప్పటికీ ఈమెకి పెద్దగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లు కనిపించలేదు. ఈమె కంటే ఎక్కువగా దిశా పటాని రోల్ కి ఇంపార్టెన్స్ ఉంది.  ఈ మూవీలో మెయిన్ హైలెట్ గా అమితాబచ్చన్ మరియు దిశా పటాని        ఇవ్వండి వారు నిలిచారు. కానీ ప్రభాస్ మరియు దీపిక పదుకొనే వంటి వారు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయారు. ఈ సినిమా అమితాబచ్చన్ మరియు దిశా పటాని వంటి స్టార్ల యాక్టింగ్ చూసేందుకు థియేటర్ కి వెళ్ళవచ్చు. ఇక వీరి యాక్టింగ్ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకోగలుగుతుంది. వీరి గురించైనా మనం కల్కి మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: