ఏపీ:జగన్ బాట వైపే చంద్రబాబు.. ఎం జరిగిందంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు.. చంద్రబాబు నాయుడు ఈసారి నాలుగవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. సీఎంగా చంద్రబాబు బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కుప్పం పర్యటనను నిర్వహించారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రజలతో మాట్లాడడం జరిగింది. అక్కడ దాదాపుగా రెండు రోజులపాటు పర్యటనలు కూడా చేపట్టారు.

కుప్పంలో 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ప్రజలకు పాదాభివందనం కూడా తెలియజేశారు. ఇలాంటి సమయంలోనే ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రజల వినతి పత్రాలను స్వీకరిస్తూ ఉండగా శాంతిపురం మండలానికి చెందినటువంటి ప్రియ, సుధాకర్ దంపతులు సైతం తమ చంటి బిడ్డతో వచ్చి తన రెండవ కుమార్తెకు పేరు పెట్టాలంటూ సీఎం చంద్రబాబుని కోరగా వెంటనే ఆయన పాపను చేతిలోకి తీసుకొని మరి పేరు పెట్టడం జరిగింది.

ఆ పాపని చంద్రబాబు నాయుడు చేతిలోకి తీసుకొని మరి ఆ పాప పేరు చరణి అంటూ పెట్టారు. తమ పాపకు ఏపీ సీఎం చంద్రబాబు పేరు పెట్టడంతో ఆ తల్లితండ్రుల ఆనందం ఉప్పొంగిపోయింది సీఎం చేత నామకరణం చేయించిన తల్లితండ్రుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి.. అయితే గతంలో కూడా వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా చూడడం జరిగింది. అంతేకాకుండా చాలామంది కారు వెంబడించి మరి సహాయం కోసం అడుగుతున్నప్పుడు చంద్రబాబు అటు జగన్ ఇద్దరు కూడా కాపీ మరి వారి యొక్క సమస్యను తెలుసుకొని మరి ఎన్నోసార్లు పరిష్కరించారు.. అయితే జగన్ చేసిన పనులను చూసే చంద్రబాబునాయుడు ఇలా ఎన్నో పనులను చేస్తూ ముందుకు వెళ్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: