తమ్ముడికి ఉపయోగపడని అల్లు అర్జున్ ఆర్మీ ఉండిదేనికని?

Suma Kallamadi
ఒక పెద్ద నిర్మాత, స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఇప్పటికీ క్రేజ్ తెచ్చుకోవడంలో సతమతమౌతున్నాడు అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్. నాన్న అల్లు అరవింద్ పెద్ద ప్రొడ్యూసర్. అన్న పుష్ప సినిమా పుణ్యమాని ఒక పాన్ ఇండియా స్టార్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇంట్లో అటువంటి ఉద్దండుల్ని ఉంచుకొని మరీ అల్లు శిరీష్ సూపర్ హిట్ కథలను ఎంచుకోవడంలో ప్రతిసారీ ఎందుకనో ఫెయిల్ అవుతున్నాడు. ఇదే అంశం తండ్రి అల్లు అరవింద్ కి, మరోవైపు ఐకాన్ స్టార్ కి అంతుబట్టడంలేదు. అంతే కాకుండా సినిమాల విషయంలో అల్లు శిరీష్ దూకుడు చూపించకపోవడం కూడా అతని కెరీర్ ని వెనక్కి నెట్టేస్తుందని మరికొంతమంది విశ్లేషకులు అంటున్నారు.
అయితే మొదట మెగా ఫామిలీ పేరుతో బాగా పాపులర్ అయిన అల్లు అర్జున్ తరువాతి కాలంలో "నాకు మెగా ఫామిలీ అండ దండగ... అల్లు ఆర్మీ ఉండగా!" అన్నమాదిరి ఒక స్టేజీపైన మాట్లాడి వివాదం తెచ్చుకున్న ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక అక్కడినుండి అల్లు అర్జున్ కి మెగాఫ్యామిలీ మధ్య సన్నని గీత ఏర్పడిందనే గాసిప్స్ ఫిలిం నగర్లో వినబడుతూ వస్తోంది. అయితే అల్లు అర్జున్ తనకి తాను ఓ ఆర్మీ సృష్టించుకున్నట్టయితే ఆ ఆర్మీ తన తమ్ముడికి ఎంతమాత్రమూ ఉపయోగ పడడం లేదాయే? అన్న రూమర్స్ ఉండనే ఉన్నాయి.
దాదాపు 2022లో ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ లేటెస్ట్ గా బడ్డీ సినిమాతో వస్తున్నాడు. అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని గట్టి నిర్ణయంతో వచ్చినట్టు కనబడుతోంది. సాం ఆంటోని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బడ్డీ సినిమా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.యి జ్ఞానవెల్ రాజా నిర్మిస్తుండడం విశేషం. ఏది ఏమైనా ఈసారి మాత్రం ఈ సినిమా హిట్ కాకుంటే శిరీష్ సినిమా కెరీర్ రిస్కుతో పడ్డట్టేనని సినిమా పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు ఆర్మీ ఏం చేస్తోంది మరి! అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఓ వర్గం వారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డం తెచ్చుకోగా అతని తమ్ముడిగా అల్లు శిరీష్ కెరీర్ లో చాలా వెనుకబడి ఉన్నాడు అన్నది నగ్న సత్యం. మరి తనకొక ఆర్మీ ఉందని చెప్పుకుంటున్న అల్లు అర్జున్ అదే ఆర్మీ సపోర్ట్ తమ్ముడికి అందించమని చెప్పడంలో విఫలమవుతున్నారు ఎందుకో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: