కల్కి మూవీ ట్రైలర్ లో ఇది గమనించారా?.. ఈ నాగ్‌ మామ కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? క్లారిటీ ఇస్తున్నాడా?

lakhmi saranya
ప్రజెంట్ ఎక్కడ చూసినా ప్రభాస్ నటిస్తున్న కల్కి ఊసే వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా నాగ్ అశ్విన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ అభిమానులకి బీభత్సంగా నచ్చేసింది అని చెప్పుకోవచ్చు. ఎంతలా అంటే ఈ సినిమాలోని ట్రైలర్ కి సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినంత. ఇక ఈ క్రమంలోనే అసలు ఈ కల్కి ఎవరు? ప్రభాస్ భైరవ పాత్రలో కనిపిస్తే మరి కల్కి పాత్రలో ఎవరిని చూపిస్తున్నారు? అంటూ తెగ చర్చలు జరుగుతున్నాయి. కాగా రీసెంట్గా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ లో కొన్ని క్రేజీ క్రేజీ హింట్స్ వదిలాడు నాగ్ మామ. అయితే ఇవి హింట్స్ నా.. లేకపోతే కన్ఫ్యూజ్ చేస్తున్నాడా అనే విషయాలు మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. మీరు బాగా గమనించినట్లు అయితే కల్కి మూవీ కాన్సెప్ట్ మొత్తం మహాభారతంలోని కురుక్షేత్రం తరహాలో ఉంటుంది.

మంచి కోసం కురుక్షేత్రం జరిగితే కలియుగంలో ఎలా మారబోతుంది? అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం భూమి మీద ఉన్న అన్ని వానరులు అయిపోతే ఆ తర్వాత పాపాలు విపరీతంగా పెరిగిపోతే మహావిష్ణువు చెప్పిన దాని ప్రకారం కల్కి గా అవతరించాలి. అయితే ట్రైలర్లో మనకు దీపిక కడుపులో ఉన్న బిడ్డ రూపంలో కల్కి జన్మించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అంతవరకు బాగానే ఉంది మరి ప్రభాస్ భైరవ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా ఈయననే నిలుస్తాడా అనేది చర్చనీయాంసంగా మారింది. అంతేకాదు ఇంకొక డౌట్ ఏంటంటే అశ్వద్ధామ సుమతి నీ కాపాడేందుకు బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు.

అయితే భైరవ సుమతి నీ పట్టుకునేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో భారీ‌ యుద్ధం కూడా జరుగుతుంది. అప్పుడు అశ్వద్ధామ నీ ఒక గుద్దు గుద్దితే అంత దూరంలో పడిపోతాడు. ఇక అప్పుడే డబ్బు రుచికి అశ్వద్ధామ కి కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు వస్తుంది. అయితే ఆ కురుక్షేత్రంలో అశ్వద్ధామను ఎవరో కొట్టినట్లు అన్న విషయం క్లారిటీ వస్తుంది. ఆ దెబ్బకి అశ్వద్ధామ దూరంగా పోయి పడతాడు. అంతేకాకుండా ఆ ఫోర్స్ కి ఏనుగులు కూడా కదిలిపోతాయి. అయితే అశ్వద్ధామ ను కొట్టిన వ్యక్తి మళ్ళీ బైరవ రూపంలో పుట్టాడా? కురుక్షేత్రంలో అశ్వద్ధామ ను కొట్టింది ఎవరు? కృష్ణుడా? అర్జునుడా? భీముడా? మహాభారతంలో అశ్వద్ధామతో యుద్ధం చేసింది ఎవరు.. అనే విషయాలు లోతుగా పరిశీలించాల్సి వస్తుంది. నాగ్ మామ కన్ఫ్యూజ్ చేస్తున్నాడో లేదా క్లారిటీ ఇస్తున్నాడో ఏ మాత్రం అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: