కల్కి 2898 ఏడి: థియేటర్లని షేక్ చేస్తుందంటారా?

Purushottham Vinay
కల్కి 2898 ఏడి: థియేటర్లని షేక్ చేస్తుందంటారా?రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్  పెంచేస్తున్నారు.ఆడియన్స్ ఫోకస్ మొత్తాన్ని సినిమా వైపు తిప్పుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన కల్కి మేకర్స్.. సెకండ్ ట్రైలర్ తో కూడా ఆ అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేశారు.ఇక సెకండ్ ట్రైలర్ అయితే విజువల్ ఫీస్ట్ గా అదిరిపోయింది. ఈ ట్రైలర్ ను మేకర్స్ చాలా అద్భుతంగా కట్ చేశారు. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, శోభనను బాగా చూపించారు. అలాగే యంగ్ హీరోయిన్ మాళవిక నాయర్ ను సర్ప్రైజింగ్ గా రివీల్ చేశారు. ప్రస్తుతం సెకండ్ ట్రైలర్.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నాళ్ల నుంచి పెరిగిన టికెట్ల రేట్ల కారణంగా చాలా మంది సినీ ప్రేక్షకులు థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్ ని కోరుకోవడం లేదు. 


ఎందుకంటే ఫ్యామిలీతో సినిమాకు వెళ్తే రూ.2500 పట్టుకోవాలసి ఉంటుంది. అందుకే ఎక్కువగా ఓటీటీ లో సినిమా చూడాలని చాలా మంది భావిస్తున్నారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా విడుదల అయిన మూడు నాలుగు వారాల్లో అది ఓటీటీ లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌ గా ఇంట్లో కూర్చుని ఓటీటీ లో సినిమాలను చూడటం అలవాటు చేసుకున్న ప్రేక్షకులకు కల్కి మేకర్స్ షాక్‌ ఇవ్వబోతున్నారు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఇప్పటికే కల్కి సినిమాను తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. కల్కి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కి ఏకంగా 8 వారాల సమయం ఉండాలని టీం ఒప్పందం జరిగిందట. సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ 50 రోజులు పూర్తి అయిన తర్వాతే స్ట్రీమింగ్ చేసుకోవాల్సి ఉంటుందట. అయితే కల్కి సినిమా కోసం 8 వారాల పాటు ఓటిటి ప్రేక్షకులు ఆగడం కష్టం. ఒక వేళ సినిమాకి గనుక పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: